ఆక్యుప్రెషర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
 
పశ్చిమ యోర్క్‌షైర్‌లో బెలిండా ఒక మహిళ 18 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో బాధపడ్తోంది. మధ్యమధ్యలో కొంత తగ్గినప్పటికీ ఇన్నేళ్ళుగా ఆమె దాన్నుండి పూర్తిగా బయటపడలేదు. మొదటిసారి డెలివరీ సమయంలో ఆమెకి డిప్రెషన్‌ వచ్చింది. ఒక్కసారిగా జీవనశైలి మారిపోవడంతో అలా జరిగింది. అనేకసార్లు తీవ్ర అలజడికి గురవడము, రాత్రులు నిద్రపట్టకపోవడము, ఉదయం వేళల్లో విపరీమైన ఆందోళనకు గురవడము, మధ్యాహ్నం వరకూ ఏడవడము, అజీర్తి, గాస్ట్రిక్‌ ట్రబులు లాంటి లక్షణాలతో ఆమె శారీరకంగా, మానసికంగా బాధపడింది. మొత్తానికి రిఫ్లెక్సాలజీ గురించి తెలుసుకుని ఆ సెంటరుకు వెళ్ళి అన్ని విషయాలూ విడమర్చి చెప్పింది. వారానికి ఒకసారి చొప్పున 5 సిట్టింగులు పూర్తయ్యేసరికి ఆమెలో నిద్రలేమి అంతరించి హాయిగా నిద్రపోసాగింది. అజీర్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది. మరి కొన్ని వారాల చికిత్స తర్వాత ఆందోళన కూడా తగ్గింది. ఆమె ఇప్పుడు పూర్తి నార్మల్‌ స్థితికి వచ్చి చక్కగా ఉద్యోగం చేసకుంటూ పిల్లలతో ఆనందంగా జీవించగల్గుతోంది.
 
41 వారముల తరువాత ప్రసవం రాకపోతే ఆక్యుప్రెషర్‌ని ఉపయోగించడము వలన ప్రసవం జరుగుతుంది. బోటన వేలు మరియు చూపుడు వ్రేళ్ల మధ్య చర్మం గల ప్రాంతంలోని నాడులపై పై ఒత్తిడి కలిగించడం వలన నొప్పులు వచ్చి ప్రసవం జరుగుతుంది.
<ref>[http://www.momjunction.com/articles/how-to-induce-labor-with-acupressure_00119638/ "How To Induce Labor With Acupressure"]</ref>
 
మరో వ్యక్తి ఒకరకమైన ఎలర్జీతో బాధపడ్తున్నాడు. అదెంత తీవ్రంగా వుండేదంటే అతనికి జలుబు చేసి, ఏ మందులు వాడినా ఆర్నెల్లపాటు తగ్గలేదట. రోజురోజుకీ ఉత్సాహం తగ్గిపోసాగింది. శరీరం, మనసు కూడా నిద్రాణంగా తయారయ్యాయి. శారీరకంగా, మానసికంగా నరకయాతన అనుభవించాడు. డాక్టర్లు పెయిన్‌ కిల్లర్లే శరణ్యమని చెప్పి స్ట్రాంగ్‌ డోసులు ఇవ్వసాగారు. ఆ దశలో అతనికి రిఫ్లెక్సాలజీ గురించి తెలిసి చికిత్సకోసం వెళ్ళాడు. ఐదు వారాల్లో అతనిలో గొప్ప మార్పు కనిపించింది. నాసికా రంధ్రాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఊపిరాడకపోవడం, జలుబు తగ్గాయి. నొప్పికి మాత్రలు వేసుకోవడం మానేశాడు. ఇప్పుడతను ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఈ చికిత్స గురించి మాట్లాడ్తూ ''రిఫ్లెక్సాలజీ నిజంగా అద్భుతమైన ట్రీట్‌మెంట్‌. నొప్పి, మానసిక ఆందోళన కూడా తగ్గిపోయాయి. ఇది క్షణాల్లో లేదా రోజుల్లో తగ్గదు. వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని నెలలు చేయించుకోవాల్సి వుంటుంది. నాది దీర్ఘకాలిక వ్యాధి కనుక నేను ఇప్పటికీ రిఫ్లెక్సాలజీ చేయించుకుంటున్నాను, ఇంకా కొంతకాలం చేయించుకుంటాను.. ఇది ఎంత ప్రయోజనకరమైందని రుజువైంది'' అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/ఆక్యుప్రెషర్" నుండి వెలికితీశారు