సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 123:
[[జానీలీవ‌ర్]] అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జ‌నుముల జాన్ ప్ర‌కాశ‌రావు' ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవ‌ర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవ‌ర్ జానీ లీవ‌ర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయ‌న సినిమా పేరుగా స్థిర‌ప‌డింది. కుటుంబం ఆర్థికంగా అనేక క‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించిన స‌మ‌యంలో జానీలీవ‌ర్‌ను స‌త్తెన‌పల్లికి చెందిన ఆయ‌న మిత్రులు ఆదుకున్నారు. ఆయ‌న స్నేహితుడు, శ‌ర‌భ‌య్య హైస్కూల్ క‌ర‌స్పాండెంట్ వెలుగూరి విజ‌య వెంక‌ట ల‌క్ష్మీనారాయ‌ణ జానీలీవ‌ర్ క‌ళాకారుడిగా ముంబ‌యిలో స్థిర‌ప‌డ‌డానికి ఎంతో సాయ‌ప‌డ్డారు. ఇవ్వాళ్టికీ చాలా త‌ర‌చుగా జానీలీవ‌ర్ సంద‌ర్శించే రెండు తెలుగు ప్రాంతాలు క‌నిగిరి, స‌త్తెన‌ప‌ల్లి మాత్ర‌మే. జానీలీవ‌ర్‌కూ స‌త్తెన‌ప‌ల్లిలో మంచి మిత్రులున్నారు. త‌న కెరియ‌ర్‌కి స‌త్తెన‌ప‌ల్లి చాలా సాయ‌ప‌డింద‌ని అనేక సంద‌ర్భాల్లో జానీలీవ‌ర్ చెప్పారు.
బ్ర‌హ్మానందం ఒకేఒక్క హిందీ చిత్రం 'వెల్‌క‌మ్‌బాక్‌'లో చేస్తే, జానీలీవ‌ర్ ఒకేఒక్క తెలుగు చిత్రం 'క్రిమిన‌ల్' (మ‌హేష్‌భ‌ట్‌)లో చేశారు.
==విద్యుత్తు విశేషాలు==
జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసినది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి మరియు ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసినారు. []
 
==మండలంలోని గ్రామాలు==
* [[దీపాలదిన్నెపాలెం(సత్తెనపల్లి)]]
"https://te.wikipedia.org/wiki/సత్తెనపల్లి" నుండి వెలికితీశారు