ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ [[ఎస్.గోపాలరెడ్డి]] వద్ద మదన్ అసిస్టెంట్ కెమెరామేన్ గా పనిచేశారు. ఆ సమయంలో పరిచయమైన దర్శకుడు రాంప్రసాద్ కి ఈ స్క్రిప్ట్ చాలా నచ్చింది. అభిరుచి కలిగి, మంచి చిత్రాలు తీసిన నిర్మాత [[అట్లూరి పూర్ణచంద్రరావు]] మళ్ళీ నిర్మాణం ప్రారంభించి [[వెంకీ]] సినిమా తీయడంతో ఆయనను సంప్రదించారు. ఆయన కథ విన్నాకా, బాగా నచ్చేసింది. మదన్ ని [[ఊటీ]] పంపించి, అక్కడ రూం వేసి సీరియల్ స్క్రిప్టు తిరగరాయించి పూర్తిస్థాయి సినిమా కథగా మలిచే బాధ్యత అప్పగించారు. అది పూర్తయ్యాకా దర్శకత్వం కోసం తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత [[భాగ్యరాజా]]ని పిలిపించి కథ చెప్పారు. ఆయనకు కథ బాగా నచ్చేసి, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చేస్తానని, అయితే తానే ప్రధానపాత్రలో నటిస్తానని ప్రతిపాదించారు. అది పూర్ణచంద్రరావుకు నచ్చకపోవడంతో ఆ ప్రయత్నమూ నిలిచిపోయింది. స్క్రిప్ట్ విని, కొన్ని మార్పులు చేసేందుకు మదన్ [[డి.వి.నరసరాజు]]ని కలిశారు. తాకట్టు లేకుండా ఏదీ అప్పుగా ఇవ్వని కోట పాత్ర హీరోకి తాకట్టు లేకుండానే అప్పు ఇస్తాడు. అదెలా సాధ్యపడుతుందన్న సందేహం తీరకపోవడంతో, డి.వి.నరసరాజు "మోసం చేయడం కూడా చేతకాని పిచ్చివాడివి.. అందుకే తాకట్టు లేకుండా అప్పు ఇస్తున్నాను" అన్న డైలాగు రాశారు. ఆ సమస్య పరిష్కారమైపోయింది. ఇలా ఓ వైపు స్క్రిప్టు పదునుగా తయారవుతూండగా సరైన దర్శకుడు మాత్రం దొరకలేదు. ప్రకాష్ రాజ్ కి ఈ కథ చెప్పారు. ఆయన బావుంది అంటూనే సినిమా కన్నా నవల అయితే సరిగా సరిపోతుందేమో ఆలోచించమని సలహా ఇచ్చారు.<br />
ఆ దశలోనే అప్పటికి రెండు సినిమాల తీసిన [[చంద్ర సిద్దార్థ]] కలిశారు. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమన్నారు. అయితే అంతిమయాత్ర కథ అప్పటికే చాలామంది తిప్పికొట్టడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన మదన్ చెప్పలేదు. ఓసారి చంద్రసిద్దార్థ్ లేని సమయంలో ఆయన అన్న కృష్ణమోహన్ తో మాట్లాడుతూండగా అంతిమయాత్ర కథ ప్రస్తావన వచ్చింది. కొద్దిగా విన్న కథని పూర్తిస్థాయిలో చెప్పించుకుని చివరకి ఆ సినిమానే చేయమని, వేరే కథల కోసం వెతకవద్దని తమ్ముడికి ఆయన గట్టి సలహా ఇచ్చారు. దాంతో పూర్ణచంద్రరావు వద్ద ఉన్న స్క్రిప్ట్ మదన్ తీసేసుకున్నారు, ప్రేమ్ కుమార్ పట్రా సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=నలుగురూ మెచ్చిన ఆ నలుగురు|url=http://www.sakshi.com/news/funday/aa-naluguru-story-behind-movie-2-246470|website=సాక్షి|accessdate=10 August 2015|quote=సినిమా వెనుక స్టోరీ - 2}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో కథానాయకుడు రఘురాం పాత్ర వయసుమళ్ళిన పత్రికాసంపాదకుని పాత్ర.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు