ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
ఆ దశలోనే అప్పటికి రెండు సినిమాల తీసిన [[చంద్ర సిద్దార్థ]] కలిశారు. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమన్నారు. అయితే అంతిమయాత్ర కథ అప్పటికే చాలామంది తిప్పికొట్టడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన మదన్ చెప్పలేదు. ఓసారి చంద్రసిద్దార్థ్ లేని సమయంలో ఆయన అన్న కృష్ణమోహన్ తో మాట్లాడుతూండగా అంతిమయాత్ర కథ ప్రస్తావన వచ్చింది. కొద్దిగా విన్న కథని పూర్తిస్థాయిలో చెప్పించుకుని చివరకి ఆ సినిమానే చేయమని, వేరే కథల కోసం వెతకవద్దని తమ్ముడికి ఆయన గట్టి సలహా ఇచ్చారు. దాంతో పూర్ణచంద్రరావు వద్ద ఉన్న స్క్రిప్ట్ మదన్ తీసేసుకున్నారు, ప్రేమ్ కుమార్ పట్రా సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=నలుగురూ మెచ్చిన ఆ నలుగురు|url=http://www.sakshi.com/news/funday/aa-naluguru-story-behind-movie-2-246470|website=సాక్షి|accessdate=10 August 2015|quote=సినిమా వెనుక స్టోరీ - 2}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో కథానాయకుడు రఘురాం పాత్ర వయసుమళ్ళిన పత్రికాసంపాదకుని పాత్ర. భావోద్వేగాలు బాగా పండించాల్సిన పాత్ర కావడంతో మొదట సినిమా తీద్దామనుకున్న [[అట్లూరి పూర్ణచంద్రరావు]] దర్శక నటులు [[విసు (నటుడు)|విసు]], [[దాసరి నారాయణరావు]], నటుడు [[మోహన్‌ బాబు]]లలో ఎవరో ఒకరితో ఆ పాత్ర చేయించాలని భావించారు. వీరెవరితోనూ కుదరకుంటే [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]] ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత [[కె.భాగ్యరాజా]]కు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశం తాను కథానాయక పాత్ర పోషిస్తానని పట్టుపట్టినందు వల్లనే చేజారింది. తర్వాత సినిమాని చేపట్టిన దర్వకుడు చంద్రసిద్ధార్థ్, మదన్ కథానాయకుని పాత్రకు [[రాజేంద్ర ప్రసాద్]] ని సంప్రదించారు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు