ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
తర్వాత సినిమాని చేపట్టిన దర్వకుడు చంద్రసిద్ధార్థ్, మదన్ కథానాయకుని పాత్రకు [[రాజేంద్ర ప్రసాద్]] ని జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా సంప్రదించారు. రాజేంద్రప్రసాద్ ఇంటి బెడ్రూంలో మదన్ దర్శకుడికి, రాజేంద్రప్రసాద్ కీ కథ వినిపించారు. కథ పూర్తికాగానే ఒకరు బాత్రూంలోకి, మరొకరు బాల్కనీలోకి వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలిపోయిన కథారచయిత మదన్ ఇక ఈ అవకాశమూ చేజారిపోయినట్టే అని నిరుత్సాహపడే దశలో రాజేంద్రప్రసాద్ కళ్ళుతుడుచుకుని వచ్చి ఈ సినిమా వెనువెంటనే ప్రారంభించాలని తన నిర్ణయం చెప్పేశారు. తర్వాత రాజేంద్రప్రసాద్ తన పాత్ర ప్రవర్తించే తీరు, సంభాషణలు చెప్పే విధానం, కళ్ళజోడు, పంచెకట్టు, విగ్గు ఇలా అన్నీ ఎలావుండాలో ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు.<br />
రాజేంద్రప్రసాద్ పక్కన కథానాయిక పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[భానుప్రియ]], [[రోజా సెల్వమణి|రోజా]] మొదలైన గతతరం కథానాయికలకు కథ వినిపించారు. అందరూ కథ చాలాబావుందని మెచ్చుకున్నవారే కానీ ఎవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. రాజేంద్రప్రసాద్ తనతో [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన [[ఆమని]]ని గుర్తుచేసుకుని, ఆమెను సంప్రదించమని సలహాఇచ్చారు. కథ విని సినిమాకు ఆమని ఓకే చెప్పారు.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" />
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. [[రామకృష్ణ స్టూడియో]], [[రామానాయుడు స్టూడియో]], రాక్ క్యాజిల్ తదితర ప్రాంతాల్లో జరిగింది.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు