ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
రాజేంద్రప్రసాద్ పక్కన కథానాయిక పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[భానుప్రియ]], [[రోజా సెల్వమణి|రోజా]] మొదలైన గతతరం కథానాయికలకు కథ వినిపించారు. అందరూ కథ చాలాబావుందని మెచ్చుకున్నవారే కానీ ఎవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. రాజేంద్రప్రసాద్ తనతో [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన [[ఆమని]]ని గుర్తుచేసుకుని, ఆమెను సంప్రదించమని సలహాఇచ్చారు. కథ విని సినిమాకు ఆమని ఓకే చెప్పారు.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" />
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. [[రామకృష్ణ స్టూడియో]], [[రామానాయుడు స్టూడియో]], రాక్ క్యాజిల్ తదితర ప్రాంతాల్లో జరిగింది. 38 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తైంది. సినిమా దాదాపుగా కోటి పాతిక లక్షల రూపాయల బడ్జెట్లో అయింది.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" /> ఆర్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర వ్యవహరించారు. సురేందర్ రెడ్డి చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేశారు.<ref name=టైటిల్స్>ఆ నలుగురు సినిమా టైటిల్స్</ref>
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
సినిమా ఎడిటింగ్ గిరీష్ లోకేష్ చేశారు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు