ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
[[డిసెంబర్ 9]], [[2009]]న సినిమా విడుదలైంది. విడుదలైన రోజున ఈ సినిమా థియేటర్లకు దాదాపు ఖాళీగా ఉన్నాయి. రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. విడుదల చేసినప్పుడు 27 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ స్పందనతో వాటిలో 16 ప్రింట్లు వెనక్కి వచ్చేశాయి. మిగిలిన 11 ప్రింట్లు కూడా వెనక్కి తిరిగివచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ దశలో రెండు వారాలు గడిచాకా సినిమా మౌత్ టాక్ తో సినిమా పుంజుకుంది. హఠాత్తుగా మొత్తం రోజంతా అన్ని షోలూ హౌస్ ఫుల్ అయ్యాయి. ఆ నలుగురు బృందమే కాక మిగతా సినిమా వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని, విమర్శకుల నుంచి ప్రశంసలను పొందింది. అవార్డులను కూడా సాధించింది.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" />
== రీమేక్స్ ==
ఆ నలుగురు సినిమా కన్నడ, మరాఠీ భాషల్లో పునర్నిర్మితమైంది. కన్నడంలో ''సిరివంత'' పేరుతో ప్రముఖ నటుడు విష్ణువర్థన్ ప్రధానపాత్రలో నటించగా ఎస్.నారాయణ్ దర్శకత్వంలో నిర్మించారు. తెలుగు వెర్షన్ ని మించిన భారీ విజయాన్ని ఆ సినిమా పొందింది.<ref name="హైబీమ్ రీసెర్చ్-సిరివంత">{{cite web|last1=రిపోర్టర్|title=Kannada film 'Sirivantha' continues to reign|url=http://www.highbeam.com/doc/1P3-1203041631.html|website=హైబీమ్ రీసెర్చ్|accessdate=12 August 2015}}</ref> విమర్శకుల ప్రశంసలు, పలు రంగాల ప్రముఖుల అభిమానం పొందింది. ఆ నలుగురు సినిమాను ప్రముఖ నటుడు [[శాయాజీ షిండే]] మరాఠీలో ''మాఝి మనస్'' పేరిట పునర్నిర్మించారు. సినిమా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చడంతో ఆయన ఈ సినిమాను పునర్నిర్మించారు. అయితే మరాఠీలో సినిమా పరాజయం పాలైంది. శాయాజీ షిండే ఈ సినిమాని హిందీలో తను ప్రధాన పాత్రలో హిందీలో పునర్నిర్మించాలని ఆశించారు. ఒకవేళ అందుకు కుదరకుంటే కనీసం తన మరాఠీ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావించారు. హిందీలో పునర్నిర్మించడానికి, లేదా కనీసం డబ్బింగ్ చేయడానికి హక్కుల కోసం మదన్ ను పలుమార్లు సంప్రదించారు. కానీ అందుకు మదన్ అంగీకరించలేదు. అయితే ఆయన ఎప్పటికైనా సినిమాను హిందీలో తీయాలని, అందుకు కుదరకుంటే తాను తీసిన మరాఠీ చిత్రాన్నే మరింత ప్రచారంతో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సినిమా మరాఠీ ప్రజల్లో వీలైనంతమందికి చేరాలని ఆయన కోరిక.<ref name="ఐడిల్ బ్రెయిన్ శాయాజీషిండే ఇంటర్వ్యూ">{{cite web|last1=విలేకరి|title=ఇంటర్వ్యూ విత్ శాయాజీషిండే|url=http://www.idlebrain.com/celeb/interview/sayajishinde2008.html|website=ఐడిల్ బ్రెయిన్|accessdate=12 August 2015}}</ref> ఇక తమిళ హక్కులను మొదట సినిమా నిర్మిద్దామనకున్న అట్లూరి పూర్ణచంద్రరావు తన వద్దే ఉంచుకున్నారు. ఆయన తమిళంలో [[రజనీకాంత్]] తోనూ, హిందీలో [[అమితాబ్ బచ్చన్]] తోనూ ఈ సినిమాను నిర్మించాలని ఆశించారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు