కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''కనుపర్తి వరలక్ష్మమ్మ''' తెలుగు రచయిత్రి. (జననం : [[అక్టోబర్ 6]], [[1896]] , మరణం :- [[ఆగష్టు 13]], [[1978]]) తెలుగు రచయిత్రి.

== జననం ==
వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు [[బాపట్ల]]లో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసేవాడు.
 
#పదవులు - గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలు ,
Line 46 ⟶ 49:
 
==రచయితగా==
1919 లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు . లేడీస్ క్లబ్ , రాణి మల్లమ్మ , మహిళా మహోదయం , పునః ప్రతిష్ట వంటి నాటికలు , ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం , ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల పాటలు , నవలలు , పిట్ట కథలు , జీవిత చరిత్రలు ,కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి . ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి . మద్రాసు , విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ . 1921లో విజయవాడలో గాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు . “ నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము . ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి . బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు .
 
== మరణం ==
[[1978]], [[ఆగష్టు 13]] న మరణించారు.
== మూలాలు ==
#తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
 
== బయటి లంకెలు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaatma%20gaan%27dhii%20smrxti%20san%27chika&author1=&subject1=Vacant&year=1948%20&language1=Telugu&pages=36&barcode=2020050002896&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=strii%20hitaishhind-iiman%27d%27ali&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-03-04&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/736 మహాత్మాగాంధీ స్మృతి సంచిక]