ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
 
==దుర్నామాలని సరిదిద్దటం==
పరిభాషలో వాడే ఇంగ్లీషులో "అతకని" పేర్లు తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని పరిశోధించే మొదటి రోజుల్లో అవగాహన అస్పష్టంగా ఉంటుంది. అట్టి సమయాలలో, కేవలం అజ్ఞానం కొద్దీ, మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు మనం తొందరపడి పెట్టిన పేరు అతకక పోవచ్చు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో చెట్ల మీద నివసించే ఒక జంతువు చూడడానికి బుల్లి ఎలుగుబంటిలా ఉందని దానికి “కొవాలా బేర్” అని పేరు పెట్టేరు. దరిమిలా ఆ జంతువు ఎలుగుబంటి జాతికి చెందనే చెందదని తెలిసింది; కాని పెట్టిన పేరు అతుక్కుపోయింది. ఇదే విధంగా పీనట్, కోకోనట్ అన్న మాటలు ఇంగ్లీషులో దుర్నామాలు. వృక్షశాస్త్రం దృష్టిలో “నట్” అనే మాట నిర్వచనంలో కోకోనట్ ఇమడదు. మనం తెలుగులో వాడే “కొబ్బరికాయ” శాస్త్రీయంగా సరి అయిన ప్రయోగం; కొబ్బరికాయ “గింజ” కాదు, అదొక పండు. అదే విధంగా “పీనట్, గ్రౌండ్‌నట్” అనే మాటలు కూడ దుర్నామాలే (“మిస్‌నోమర్స్,” misnomers). మనం తెలుగులో వాడే “వేరుసెనగ” అన్న పేరు నిజానికి దగ్గర. అంటే ఏమిటన్నమాట? ఈ సందర్భంలో ఇంగ్లీషు పేర్ల కంటె తెలుగు పేర్లు శాస్త్రీయంగా సరి అయినవి.
 
ఈ సందర్భంలో మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో “బటర్ ఫ్లై” (butterfly) అన్న మాటకి ఆ పేరు ఎలా వచ్చిందో, దానికి తెలుగులో సీతా (శీతా?) కోక చిలక అన్న పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని “బటర్ ఫ్లై” లో బటరూ లేదు, అది శాస్త్రీయంగా “ఫ్లై” కాదు. “సీతాకోక చిలక” లో సీత (శీత) లేదు, కోక లేదు, అది చిలక కాదు! అందువల్ల ఈ అనువాదంతో ఇబ్బందీ లేదు.
 
గణితంలో “రేండం“రేండమ్‌ వేరియబుల్” అనే భావం ఉంది. ఇది “రేండమూ” కాదు, “వేరియబులూ” కాదు. ఏదో ఇంగ్లీషులో పొరపాటు దొర్లి వాడుకలోకి వచ్చేసింది. ఇప్పుడు దీనిని “అనిర్ధిష్ట చలరాసి” అని అనువదిస్తే అది అతకని అనువాదమే అవుతుంది. ఇది ఎంత అతకని పదబంధం అయినా ఈ ఇంగ్లీషు మాట పాతుకు పోయింది. దీని పేరు ఇప్పుడు మరమ్మత్తు చెయ్యలేము. కాని దీనికి తెలుగులో పేరు పెట్టాలనే “పిచ్చి” ఉన్నవాళ్లు మాత్రం దీనిని “అనిర్ధిష్ట చలరాసి” అని తెలిగించకుండా స్వయం బోధకమైన మాటతో తెలిగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రేండమ్‌ వేరియబుల్ నిజానికి చలనరాసి కాదు, అదొక ప్రమేయం (function).
 
భౌతిక శాస్త్రంలో “పోలరైజేషన్” అనే భావం ఉంది. దీనిని ధ్రువీకరణ అని అనువదించటం శుద్ధ తప్పు; ఎందుకంటే పోలరైజేషన్ అన్న పేరు ఎంపికలో పొరపాటు జరిగింది కనుక. పూర్వం కాంతి రేణువుల రూపంలో ఉంటుందనిన్నీ, ఈ రేణువులకి అయస్కాంత ధ్రువాలులా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయనీ అనుకునేవారు. ఈ ధ్రువాలు సిపాయిలలా బారులు తీరి ఉన్నప్పుడు ఆ కాంతిని "పోలరైజ్‌డ్ కాంతి" అనమన్నారు. కాని దరిమిలా కాంతి కెరటాలులా ప్రవహిస్తుందనిన్నీ, ఈ కెరటాలు ఒకే సమయంలో రెండు దిశలలో (పైకి, కిందికి; ముందుకి, వెనక్కి) ఊగిసలాడుతూ ఉంటాయనీ తెలిసింది. కొన్ని రకాల అద్దాల గుండా కాంతి ప్రవహించినప్పుడు ఆ గాజు అద్దం గుండా నిలువుగా పైకీ,కిందకీ ఊగిసలాడే కెరటమే వెళుతుంది కాని అడ్డుగా ముందుకీ, వెనక్కీ ఊగిసలాడేది వెళ్లలేదు. అంటే ఒక తలంలో ఊగిసలాడే కాంతి వెళుతుంది, దానికి లంబ దిశలో ఊగిసలాడే కెరటం అడ్డగించబడుతుంది. ఇదీ జరిగే తంతు. ఇందులో ఎక్కడా ధ్రువాలు లేవు. ఈ తంతుని “తలీకరణ” అంటే బాగుంటుంది కాని, ధ్రువీకరణ అంటే తప్పు అర్థం స్పురితుంది, అలా అనకూడదు. ఇలాంటి ఉదాహరణలు ఇంగ్లీషులో కోకొల్లలు. ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనంతెలుగువాడు ఎందుకు వేల్లాడటం? ఎన్నాళ్లు వేల్లాడడం? ఆలోచించండి.
 
జీవశాస్త్రంలో “క్రోమోజోము” అన్న మాటనే తీసుకుందాం. గ్రీకు భాషలో “క్రొమో” అంటే రంగు, “సోమా” అంటే పదార్థం కనుక “క్రోమోజోము” అంటే రంగుపదార్థం. తెలుగులో ఈ మాటని యథాతథంగా ఉంచేసినా, రంగు పదార్థం అని అనువదించినా మనకి కలిగే మనో వికాసం శూన్యం. మరి ఇంగ్లీషువాడు వీటిని “రంగు పదార్థం” అని ఎందుకు అన్నాడు? జీవ కణం లోని పదార్థం పారదర్శకంగా ఉంటుంది. దానిని పారదర్శకంగా ఉన్న గాజు పలకకి పులిమి, ఆ గాజు పలకని సూక్ష్మ దర్శనిలో పెట్టి చూస్తే గాజు పలకకి, కణం లోని పదార్థానికి మధ్య విచక్షణ తెలిసేది కాదు. అందుకని కణానికి రంగు పులిమేవారు. వారు పులిమిన రంగు అంటుకున్న భాగాలు మనకి ఖణిగా కనిపించేవి. అలా ఖణిగా కనిపించిన పదార్థాన్ని “రంగు పదార్థం” లేదా క్రోమోజోము అని పిలవటం మొదలు పెట్టేరు. అంతేకాని ఆ పదార్థానికి స్వతహాగా రంగు లేదు. కనుక ఇంగ్లీషులో ‘క్రోమోజోము” అన్న పేరు తప్పు. కాని దాని వాడుక పాతుకుపోయింది. దానిని మార్చమని నేను అడిగితే నన్నుఅడిగిన వాళ్లని ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారు. కాని దానికి తెలుగులో పేరు పెట్టవలసి వచ్చినప్పుడు “వారసవాహికలు” అని తెలిగిస్తే ఎంత సుబోధకంగా ఉందో చూడండి. నేను ఇలా తాపత్రయం పడిపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి నా మీద జాలి పడి, “ఱావు గారూ, అలాగే లెండి. ఇటుపైన ‘కణములో కనిపించే వారసవాహికలని క్రోమోజోములు అందురు’ అని పాఠం చెబుతాను లెండి” ని నన్ను ఊరడించేడు.
 
అలాగని ఇంగ్లీషుని పరిపూర్ణంగా పరిత్యజించమనటానికి కూడ వీలు లేదు. రసాయన శాస్త్రంలో తారసపడే నిర్మాణక్రమాలు (స్ట్రక్‌చరల్ ఫార్ములాస్, structural formulas), సాంఖ్య క్రమాలు (ఎంపిరికల్ ఫార్ములాస్, empirical formulas) రాయవలసి వచ్చినప్పుడు మూలకాల పేర్లని ఇంగ్లీషు లిపిలోనే రాయాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. మడిగట్టుకుని H2OH<sub>2</sub>O ని “ఎచ్2ఒ”“ఎచ్<sub>2</sub>ఒ” అని రాయమనటం భావ్యం కాదు.
 
అలాగని ఇంగ్లీషుని పరిపూర్ణంగా పరిత్యజించమనటానికి కూడ వీలు లేదు. రసాయన శాస్త్రంలో తారసపడే నిర్మాణక్రమాలు (స్ట్రక్‌చరల్ ఫార్ములాస్, structural formulas), సాంఖ్య క్రమాలు (ఎంపిరికల్ ఫార్ములాస్, empirical formulas) రాయవలసి వచ్చినప్పుడు మూలకాల పేర్లని ఇంగ్లీషు లిపిలోనే రాయాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. మడిగట్టుకుని H2O ని “ఎచ్2ఒ” అని రాయమనటం భావ్యం కాదు.
==ముక్తాయింపు==
తెలుగులో వైజ్ఞానిక విషయాల మీద రాసిన రాతలు బహు కొద్ది. తెలుగులో పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు వేరు, విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు. తెలుగులో పారిభాషిక పదజాలం లేదంటూ ఆలోచనారహితంగా ఇంగ్లీషు పదబంధాల మధ్య తెలుగు క్రియావాచకాలని జొప్పించగా వచ్చే కంతిరీ భాష తెలుగూ కాదు, ఇంగ్లీషూ కాదు. అటువంటి భాష వాడితే ఇటు ఇంగ్లీషులోను, అటు తెలుగులోనూ ప్రతిభ లేదని చాటుకోవటమే అవుతుంది.