పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
పోకిరి సినిమా స్క్రిప్ట్ [[పూరీ జగన్నాధ్]] తన తొలిచిత్రం [[బద్రి (2000 సినిమా)|బద్రి]] చిత్రీకరిస్తున్న సమయంలోనే రాసుకున్నారు. అప్పటికి ఆ ప్రాజెక్టుకు ఆయన పెట్టుకున్న పేరు "ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ". ఆ తర్వాత కొన్నేళ్ళకు వరుస విజయాల అనంతరం [[ఆంధ్రావాలా (సినిమా)|ఆంధ్రావాలా]] భారీ పరాజయం పాలైన తర్వాత పూరీ జగన్నాథ్ చిరంజీవితో "శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ" పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. చిరంజీవితో సినిమా అంటే ఆయన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడం డేట్స్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వడం వంటి చాలా కారణాలతో కొంత ఆలస్యం ఉంటుంది. ఆ కారణంగా అప్పటికే తన వద్ద ఉన్న స్క్రిప్టుతో [[రవితేజ (నటుడు)|రవితేజ]] హీరోగా "ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ" సినిమా చేద్దామనున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు వినీవినడంతోనే సినిమా చేద్దామన్న నిర్ణయానికి రవితేజ వచ్చేశారు. అయితే తమిళ సినిమా ''ఆటోగ్రాఫ్'' రీమేక్ [[నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్]] చేసే అవకాశం రవితేజకి వచ్చింది. రవితేజకి అది ఇష్టమైన సబ్జెక్ట్, వదులుకుంటే ఎవరైనా చేసేస్తారని దాన్ని అంగీకరించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ వాయిదాపడింది. ఈలోగా తన తమ్ముడు [[సాయిరాం శంకర్]] హీరోగా [[143]] సినిమా చేశారు పూరీ జగన్నాథ్. అయితే ఆ సినిమా చేశాకా కూడా రవితేజ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో పూరీ జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ ని విలన్, సపోర్టింగ్ పాత్రల్లో చేస్తున్న [[సోనూ సూద్]] తో చేసేద్దామని అనుకున్నారు. సోనూ సూద్ ని హీరోగా పరిచయం చేసి ఈ సినిమా చేయడం ప్రయోగాత్మకమే అయినా ఆలస్యం చేయడం కన్నా అదే నయమని భావించారు. కానీ కొన్ని మార్కెట్ లెక్కలు కుదరకపోవడంతో ఆ ఆలోచన వదులుకున్నారు.<br />
అలా చివరకు [[నవంబర్ 3]], [[2004]]న హైదరాబాద్ తాజ్ హోటల్లో మహేష్ బాబుకు పూరీ కథ చెప్పారు. అప్పుడు చెప్పిన కథ ప్రకారం హీరో పాత్ర పేరు ఉత్తమ్ సింగ్, ఓ సిక్ఖుల కుర్రాడు. కానీ చివర్లో అతని తండ్రి సూర్యనారాయణ అనీ, అతనో పోలీసాఫీసర్ అనీ తెలుస్తుంది. కథ మహేష్ బాబుకు నచ్చింది, తర్వాతి సంవత్సరం మొదలుపెట్టేద్దామని మహేష్ బాబు అంగీకరించేశారు. అయితే హీరోకి ఉన్న సిక్ఖు నేపథ్యం తీసేయమని మహేష్ అడిగారు. దాంతో హీరో సిక్ఖు అన్న నేపథ్యాన్ని తీసేశారు. అప్పటివరకూ స్క్రిప్ట్ పేరును దాని నేపథ్యంలోనే ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అని పెట్టారు, దాన్ని మార్చేయడంతో పూరీ సినిమాకి పోకిరి అన్న పేరు పెట్టారు.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=మైండ్ బ్లాక్ చేసింది|url=http://www.sakshi.com/news/funday/puri-jagannath-story-behind-film-dialogues-244575#|website=సాక్షి|accessdate=12 August 2015}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
పోకిరి సినిమా మొట్టమొదట రవితేజతో తీద్దామనుకున్నారు. ఆయనకు కూడా సినిమా నచ్చి ఓకే చేశారు. కానీ ఎప్పుడూ డేట్స్ సమస్య వస్తూండడంతో ఆయన చేయలేకపోయారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు