పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
అలా చివరకు [[నవంబర్ 3]], [[2004]]న హైదరాబాద్ తాజ్ హోటల్లో మహేష్ బాబుకు పూరీ కథ చెప్పారు. అప్పుడు చెప్పిన కథ ప్రకారం హీరో పాత్ర పేరు ఉత్తమ్ సింగ్, ఓ సిక్ఖుల కుర్రాడు. కానీ చివర్లో అతని తండ్రి సూర్యనారాయణ అనీ, అతనో పోలీసాఫీసర్ అనీ తెలుస్తుంది. కథ మహేష్ బాబుకు నచ్చింది, తర్వాతి సంవత్సరం మొదలుపెట్టేద్దామని మహేష్ బాబు అంగీకరించేశారు. అయితే హీరోకి ఉన్న సిక్ఖు నేపథ్యం తీసేయమని మహేష్ అడిగారు. దాంతో హీరో సిక్ఖు అన్న నేపథ్యాన్ని తీసేశారు. అప్పటివరకూ స్క్రిప్ట్ పేరును దాని నేపథ్యంలోనే ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అని పెట్టారు, దాన్ని మార్చేయడంతో పూరీ సినిమాకి పోకిరి అన్న పేరు పెట్టారు.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=మైండ్ బ్లాక్ చేసింది|url=http://www.sakshi.com/news/funday/puri-jagannath-story-behind-film-dialogues-244575#|website=సాక్షి|accessdate=12 August 2015}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
పోకిరి సినిమా మొట్టమొదట రవితేజతో తీద్దామనుకున్నారు. ఆయనకు కూడా సినిమా నచ్చి ఓకే చేశారు. కానీ ఎప్పుడూ డేట్స్ సమస్య వస్తూండడంతో ఆయన చేయలేకపోయారు. తర్వాత పూరీ జగన్నాథ్ [[సోనూ సూద్]] హీరోగా సినిమా చేద్దామని భావించారు. అయితే సినిమాకు అవసరమైన కొన్ని లెక్కలు సరిపడకపోవడంతో ప్రాజెక్టు సోనూ సూద్ నుంచి చేజారింది. చివరకు మహేష్ బాబు కథ విని సినిమా అంగీకరించారు. సినిమాలో ఆయన పాత్ర కోసం అప్పటివరకూ ఒకలా ఉన్న మహేష్ హెయిర్ స్టైల్ విభిన్నంగా మార్చారు. సినిమా హీరోయిన్ గా ముందు [[ఆయేషా టాకియా]]ని పెట్టుకుందామనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో హీరోయిన్ ని మార్చారు. తర్వాత చాలామందిని హీరోయిన్ పాత్ర కోసం చూశారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు