లాల్‌జాన్ బాషా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =
| birth_name =
| birth_date = [[1956ఆగస్టు 2]] , [[ఆగస్టు 21956]]
| birth_place =
| native_place =
పంక్తి 37:
 
'''లాల్‌జాన్ బాషా''' ఒక రాజకీయవేత్త మరియు [[తెలుగుదేశం]] పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో [[గుంటూరు]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త [[ఎన్.జి.రంగా]] ను ఓడించారు. తరువాత ఆయన భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓసారి పనిచేశారు. లాల్ జాన్ భాషా [[గుంటూరు]] లో కీలకమైన నాయకుడుగా గుర్తింపుపొందారు.
 
==జీవిత సంగ్రహం==
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంటూరు మాజీ ఎంపీ లాల్‌ జన్‌ బాషా [[ఆగస్టు 2]], [[1956]] న [[గుంటూరు]] జిల్లాల్లో జన్మించారు. బాషాకు 1977లో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు. ఇనుము వ్యాపారి అయిన బాషా, ఎన్టీఆర్‌ హయాంలో టిడిపిలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో గుంటూరులో [[ఎన్.జి.రంగా]] పై గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి బాషా రికార్డు సాధించారు.ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా బాషాకు గుర్తింపు ఉంది. అయితే తదుపరి 1996, 98లో గుంటూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి [[రాయపాటి సాంబశివరావు]] చేతిలో ఓటమి చెందారు. 1999లో నరసారావుపేట నుంచి పోటీ చేసి [[నేదురుమల్లి జనార్థనరెడ్డి]] చేతిలో ఓటమి పొందారు. బాషా ఎన్నడూ తెలుగుదేశం పార్టీని వీడలేదు. పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలలో, సంస్థాగత వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి 2002లో చంద్రబాబు ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు<ref>[http://www.sakshi.com/news/top-news/tdp-leader-lal-jan-basha-dies-in-road-accident-57452 లాల్ జాన్ బాషా గూర్చి సాక్షి లో ]</ref>. పొలిట్‌బ్యూరో సభ్యులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మర్కంటైల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా, టిడిపి మైనార్టీ విభాగ ఛైర్మన్‌గా బాషా పనిచేశారు. దేశంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, విదేశాంగ విధానంపైన, వివిధ వర్గాల ప్రజల కష్టాలపై బాషా లోక్‌సభలో, రాజ్యసభ సభల్లో తన వాణిని వినిపించారు. సౌదీలో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మహిళల సంక్షేమం కోసం తెలుగుదేశం హయాంలో అమలుచేసిన దీపం పథకం రూపకల్పనలో కూడా బాషా ముఖ్యపాత్ర పోషించారు. టిడిపి ఇటీవల ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్‌ను రూపొందించడంలో బాషా ముఖ్య భూమిక పోషించారు. మైనార్టీల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించడంతో పాటు పెద్ద దిక్కుగా నిలిచారు.
"https://te.wikipedia.org/wiki/లాల్‌జాన్_బాషా" నుండి వెలికితీశారు