శ్రీమంతుడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''శ్రీమంతుడు ''' 2015 ఆగస్టు 7న విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
 
ANDHRABHOOMI (DATE : FRIDAY 14/08/2015) REVIEW FRIDAY (RATING TWO STARS) <**>
 
** శ్రీమంతుడు (ఫర్వాలేదు)
 
తారాగణం:
మహేష్, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సంపత్‌రాజ్, ముఖేష్‌రుషి, సుకన్య, సితార, తులసి, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అలీ, వెనె్నల కిషోర్
ఫైట్స్: ఎఎన్‌ఎల్ అరసు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
ఛాయాగ్రహణం: మధి
బ్యానర్: మైత్రీ మూవీస్ మేకర్స్,
మహేష్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని,
వై రవిశంకర్, మోహన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ
 
కథ నుంచి కథానాయకుడు పుట్టుకొస్తే -అది మిర్చి. కథానాయకుడి కోసం కథను పట్టుకొస్తే -అది శ్రీమంతుడు.
 
***
 
పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక లింకు -ఊరు దత్తత. సింపుల్‌గా శ్రీమంతుడు సినిమా ఇది. కథ -రెండు లైనే్ల అనిపించొచ్చు. కథనంలో -రెండే జీవితాలు కనిపించొచ్చు. కానీ చూపించడానికి చాలా స్పాన్ ఉన్న -స్టోరీ పాయింట్.
పల్లె.. పట్టణం.. ఫ్యామిలీ..
 
 
నిజానికి ఈ మూడూ చాలు. -్భవోద్వేగాలు నిండిన క్లాసిక్‌నో, వీరోచితాన్ని ప్రదర్శించే యాక్షన్ ఫ్లిక్‌నో తీర్చిదిద్దడానికి. కానె్సప్ట్ చెక్కు చెదరకుండా కమర్షియల్ స్క్రీన్‌ప్లే కోటింగ్‌తో కనువిందు చేయడానికీ చాన్స్ ఉన్న స్టోరీ పాయింట్. మరి శ్రీమంతుడు ఆ హైట్స్‌కు రీచ్ అయ్యాడా?
 
***
బేసికల్‌గా కొరటాల శివ రైటర్. నిజానికి డైరెక్షన్‌కు అదొక అడ్వాంటేజ్. ఆ సామర్థ్యంతోనే ‘మి ర్చి’ ఘాటు రుచి చూపించాడు. ఇప్పుడు -ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచే ఆడియన్స్ ‘శ్రీమంతుడి’నీ చూడాల్సి వచ్చింది. ఇక -మహేష్ బాబు వరుసగా రెండు డిజాస్టర్లు ఫేస్ చేసిన హీరో. అయినా ఫేస్ ఇమేజ్ దెబ్బతినకుండా జాగ్రత్తపడిన బ్రిలియంట్. దీనికితోడు -కేవలం వీళ్లిద్దరి కోణం నుంచే సినిమా చూడాలన్నంత ప్రమోషనల్ హైప్ క్రియేట్ అయిన సినిమా -శ్రీమంతుడు. మహేష్‌కు -మూడో డిజాస్టర్ ముప్పు తప్పించేందుకు, తెలుగు ఇండస్ట్రీలో ఏ దర్శకుడికీ -సెకెండ్ ఫ్లిక్ వర్కవుట్ కాలేదన్న సెంటిమెంట్‌కు పుల్‌స్టాప్ పెట్టేందుకు జరిగిన ప్రయత్నంలో కొన్ని లోపాలు తలెత్తాయి. మూలాన్ని మర్చిపోయేలా చేశాయి. అవే శ్రీమంతుడి హైట్స్‌ని కిందకు లాగేశాయి. లేదంటే -సక్సెస్ మరోలా ఉండేదేమో.
 
 
మైనస్ పాయింట్లు:
 
 
పల్లె మూలాలు వెతుక్కోవడానికి బయలుదేరిన హీరో హర్షవర్ధన్ (మహేష్) -తన స్వభావ మూలాలు వదిలిపెట్టేశాడా? అనిపిస్తుంది. సిని మా చూస్తున్నంత సేపూ -హీరో కోసం తయారైన కథలాగే తోచింది. హీరో కోసమే మిగిలిన పాత్రలన్నీ అతనికనుగుణంగా స్వభావాల్ని మార్చేసుకుంటున్నట్టూ అనిపిస్తుంది. సినిమాలో హీరో ఏంచేశాడు? అన్న ప్రశ్నకు సమాధానంగా వంద పాయింట్లు చెప్పొచ్చు. హీరోయిన్ చెప్పగానే ఊరి గురించి తెలుసుకున్నాడు. పిల్లాడిని కాదు, పల్లెనే దత్తత తీసుకున్నాడు. స్కూలు కోసం, రోడ్డు కోసం -తండ్రి సంపాదించిన ఆస్తినుంచి తృణప్రాయంగా చెక్కులు రాసిచ్చేశాడు. ఊరి బాగుకి పేపర్లపై ఏవేవో ప్రణాళికలూ గీసేశాడు. ఊళ్లో పదిమందికీ నమ్మకమైన వ్యక్తి (రాజేంద్రప్రసాద్) కంటే బలమైన సుద్దులే చెప్పాడు. పదిమందిలో ఒకడిగా పని చేశాడు. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. కానీ -హీరోగా ఏం చేశాడు? అన్న ప్రశ్నకే సరైన సమాధానం దొరకదు. విలన్ల (సంపత్ రాజ్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్) దగ్గరున్న పదుల పహిల్వాన్లను ఉతికి ఆరేశాడని చెప్పడం తప్ప. హీరో కోసమే కథను వండుకున్నా -ఆ పాత్రకు బలమైన ఔచిత్యాన్ని ఆపాదించినట్టు అనిపించలేదు. పిల్లాడిని దత్తత తీసుకోవడం అంటే -వాణ్ని గొప్పవాడిగా తీర్చిదిద్దడం. పల్లెను దత్తత తీసుకోవడమంటే -చైతన్య ఊపిర్లూది స్వయం సమృద్ధి దిశగా నడిపించటం. మూలంలోని బలమైన పాయింట్‌ను విశే్లషించకుండా -తండ్రి సంపాదించిన ఆస్తినుంచి లక్షలకు లక్షలు చెక్కులు రాసిచ్చేయడం హీరో పాత్ర ఔచిత్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ‘ఎంత డబ్బుంది’ అన్న విలన్ ప్రశ్నకు -‘ఇంకా చాలా ఉంది’ అంటాడు హీరో. తండ్రి సంపాదించిన డబ్బులో హీరోకు వాటాయే తప్ప, ఆ సంపాదనలో ఎలాంటి కష్టమూ లేదు. తండ్రి కష్టాన్ని తన ఇష్టంగా రాసిచ్చేయడం -హీరో ఔచిత్యాన్ని దారుణంగా దెబ్బతీసేదే. మళ్లీ చివరిలో తండ్రి సంపాదించిన కోట్ల ఆస్తిని కాదనుకుని -పల్లెకు బయలుదేరిపోతాడు హీరో. ఆ పాత్ర స్వభావాన్ని ఇష్టానురీతిన మార్చేయడంతో -ఆడియన్స్ అతన్ని చూసి ఆనందించారేమోగానీ, బలంగా ట్రావెల్ చేయలేకపోయారు. ‘ఊళ్లోని మంచినీ, చెడునీ దత్తత తీసుకున్నా’నంటాడు హీరో. అదో పెద్ద మైనస్. చెడుని దత్తత తీసుకోవడమంటే సంస్కరించాలి తప్ప, సంహరించటం కాదు. రాక్షసుల్లాంటి విలన్లను సంహరించడానికే హీరో అవతరించాల్సి వచ్చినపుడు -చేయాల్సింది దత్తత కాదు, దుష్టశిక్షణ.
 
 
ఇక -హీరోయిన్ (శృతిహాసన్) పాత్రకున్న ఔన్నత్యాన్నీ మర్చిపోయారు. తను పుట్టి పెరిగిన పల్లెలో కష్టాల్ని చూసి చలించిపోయిన ఒక అమ్మాయి -సిటీకి వచ్చి రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చదువుతుంది. పల్లెల్ని బాగుచేయాలన్న గొప్ప టాస్క్‌తో నడిచే పాత్రధారిణితో -ఐటెమ్ సాంగ్‌ల్ని మించిపోయేలా డ్యాన్స్‌లు చేయించడమే పెద్ద మైనస్. హీరోయిన్ కనుక.. అందాల ప్రదర్శన ఆమె బాధ్యతేనన్నట్టు -అతిగా చూపించడం వల్ల ఆ పాత్ర ఆడియన్స్ మైండ్‌లో బలమైన ముద్ర వేయలేకపోయింది.
 
***
 
ఊరి బాగు కోసం శత్రు శిబిరంలోకి ధైర్యంగా వెళ్లి ప్రేమతో వాళ్లను మార్చిన కథ -మిర్చి. ఊరినే దత్తత తీసుకుని, తండ్రి సంపాదించిన ఆస్తిని ఊరి కోసం ఖర్చు పెట్టడం -శ్రీమంతుడు. విలన్లతో పెట్టిన ఫైట్లలో తప్ప, పాత్రలో హీరోయిజం లేకపోవడమే పెద్ద మైనస్.
 
 
కథలోనే బలమైన లోపాలు ఉండటంతో -పాత్రధారులు ప్రతిభ ఆనందాన్నిచ్చిందే తప్ప, హత్తుకునేంత దగ్గరతనాన్ని కలిగించలేకపోయింది. ఇక సంభాషణల్లో రైటర్‌గా శివ ప్రతిభ -కొన్ని సన్నివేశాల్లో స్పష్టంగా కనిపించింది. హర్షవర్దన్ పాత్రకు మహేష్ కొత్త స్టయిల్, మ్యానరిజాన్ని ఆపాదించగలిగాడు. ఒక శ్రీమంతుడు తన ఊరికోసం పడే తపనను ప్రదర్శించడంలో ఒప్పించగలిగాడు. హీరోయిన్ శృతిహాసన్, తండ్రిగా జగపతిబాబు, తల్లిగా సుకన్య, ఊరి బాగుకోరే పెద్దగా రాజేంద్రప్రసాద్, విలన్లుగా సంతప్, ముఖేష్.. సపోర్టింగ్ కాస్ట్ తమవంతు సహాకారాన్ని అందించారు. వెనె్నల కిషోర్, అలీ ద్వయం సీరియస్ టోన్‌లో ఉన్న సినిమాకు కాస్త సరదా అందించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం ఒకే. నిజానికి, సాంకేతిక వర్గం శక్తికి మించి పనితనాన్ని చూపించారు. లేదంటే -శ్రీమంతుడు రేంజ్ ఇప్పుడున్న స్థాయిని కూడా అందుకోలేకపోయేదేమో!
 
==తారాగణం==
{{colbegin}}