హైదరాబాదుపై పోలీసు చర్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
నిజాము: “పొరపాట్లు మానవసహజం”
పటేల్: “నిజమే. పొరపాట్ల వెంటే, సంబంధిత పరిణామాలు కూడా ఉంటాయి”
 
 
==అ(న)ల్ప విషయాలు==
 
పోలీసు చర్య తరువాత ముస్లిములపై దాడులు జరిగాయనీ, వారిని ఊచకోత కోసారనీ వార్తలు వచ్చాయి. దీని విచారణకై, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పట్టుదలమీద ప్రధాని నెహ్రూ పండిట్ సుందర్‌లాల్, యూనస్ సలీం, అబ్దుల్ గఫార్ లతో ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించాడు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఈనాటికీ వెలుగు చూడలేదు.
 
 
చర్య చేపట్టింది భారత సైన్యమే అయినా, దీనిని పోలీసు చర్య అన్నారు, సైనిక చర్య అనలేదు. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి:
:నిజాము అప్పటికే హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రక్రియలో భాగంగా పాకిస్తానుతో మంతనాలు నెరుపుతున్నాడు. బ్రిటను టోరీ పార్టీ నాయకులతో కూడా సంబంధాలుండేవి. [[ఐక్యరాజ్యసమితి]]కి హైదరాబాదు విషయాన్ని అప్పటికే నివేదించి ఉన్నాడు. భారత ప్రభుత్వమేమో హైదరాబాదు దేశ అంతర్భాగమని వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సైనిక చర్య చేపడితే స్వంత భూభాగంపైనే సైన్యాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందనే ప్రశ్న ఉద్భవిస్తుందని తలచి, ప్రభుత్వం దీనిని ''పోలీసు చర్య'' అని పిలిచింది.
 
==బయటి లింకులు==