ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
 
మెతల్ ఆల్కహాలులో ఉన్న ఈ (-OH) గుంపుని ఇంగ్లీషులో “హైడ్రాక్సిల్ గ్రూప్” (hydroxyl group) అంటారు. “హైడ్రొజన్”, “ఆక్సిజన్” అన్న మాటలని సంధించగా వచ్చింది ఈ హైడ్రాక్సిల్ అన్న పదం. ఒక పదార్థపు బణువులో కర్బనంతో పాటు ఈ హైడ్రాక్సిల్ గుంపు ఎప్పుడు ఉన్నా ఆ పదార్థాన్ని “ఆల్కహాలు” అనే పిలుస్తారు. అంటే, ఈ ఆల్కహాలు అనేది ఇంటిపేరు లాంటిది. ఒకే ఇంటిపేరుతో ఎంతోమంది మనుష్యులు ఉన్నట్లు, ఆల్కహాలు పేరుతో ఎన్నో రసాయనాలు ఉన్నాయి. మెతల్ గుంపు (-CH3CH<sub>3</sub>) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే మెతల్ ఆల్కహాలు వస్తుంది. ఎతల్ గుంపు (-C2H5C<sub>2</sub>H<sub>5</sub>) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే ఎతల్ ఆల్కహాలు వస్తుంది. ఇదే బాణీలో ప్రొపైల్ ఆల్కహాలు, బ్యుటైల్ ఆల్కహాలు, … అలా ఎన్నో ఉన్నాయి.
 
ఈ మెతల్ ఆల్కహాలుని శాస్త్రీయపు భాషలో కాకుండా సామాన్యులు వాడే ఇంగ్లీషులో “ఉడ్ ఆల్కహాల్” (wood alcohol) అంటారు. (అంటే కర్రసారా అన్న మాట. కర్రలని ఆవంలో పెట్టి బట్టీ పడితే కర్రసారా వస్తుంది.) నిజానికి ఈ మెతల్ ఆల్కహాలుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీకు భాషలో “మెథీ” అంటే సారా, “హాల్” అంటే చిట్టడవి. ఇంగ్లీషులో చిట్టడవిని “ఉడ్” (wood) అంటారు. కనుక “మెతల్ ఆల్కహాల్” కి ఇంగ్లీషులో wood alcohol అని పేరు వచ్చింది కనుక తెలుగులో “అడవి సారా” అవాలి. కాని ఇంగ్లీషు వచ్చుననుకునే తెలుగు వాళ్లు “ఉడ్” అన్న మాటని “కర్ర” అని తెలిగించి దీనిని "కర్రసారా" అన్నారు. ఒక విధంగా "అడవి సారా" కంటె "కర్ర సారా" అన్న మాటే బాగుందనిపిస్తుంది.
పంక్తి 42:
 
===ఎతల్ ఆల్కహాలు===
మెతేను నుండి మెతల్ ఆల్కహాలుని తయారు చేసినట్లే ఎతేను బణువులో ఒక ఉదజని అణువుని తొలగించి ఆ స్థానంలో హైడ్రాక్సిల్ గుంపుని ప్రవేశపెడితే ఎతల్ ఆల్కహాలు వస్తుంది. ఈ ఎతల్ ఆల్కహాలు నిర్మాణక్రమం బొమ్మ 15.1 లో చూపిస్తున్నాను.
 
బొమ్మ 15.1 ఎతల్ ఆల్కహాలు నిర్మాణక్రమం
 
జినీవా ఒప్పందం ప్రకారం మెతల్ ఆల్కహాలుని మెతనోలు అన్నట్లే ఎతల్ ఆల్కహాలుని ఎతనోలు (ethanol) అనాలి. మెతల్ ఆల్కహాలుని కర్రలు బట్టీపట్టి చేస్తాం. ఎతల్ ఆల్కహాలుని చెయ్యడానికి దినుసులని కాని, పళ్ళని కాని పులియబెట్టి చేస్తారు. మెతల్ ఆల్కహాలు విషం. ఎతల్ ఆల్కహాలు అమృత తుల్యం! సంస్కృతంలో అమృతానికీ, ఎతల్ ఆల్కహాలుకీ “సుర” అన్న మాటనే వాడతారు.
పంక్తి 63:
ఈస్టు విసర్జించే “అపాన ద్రావణం” ఎతల్ ఆల్కహాలు, “అపాన వాయువు” కార్బన్ డై ఆక్సైడు” మాత్రమే అయితే సారా పరిశ్రమ శ్రమ లేకుండా నల్లేరు మీద బండి నడకలా కొనసాగి ఉండేది. ఈస్టు మనలాగే ప్రాణం ఉన్న జీవి కనుక, మనలాగే అన్ని పనులు అవకతవకలు లేకుండా చెయ్యలేదు. ఉదాహారణకి, పళ్లల్లో ఉన్న ఒక రకం చక్కెరని మాత్రమే ఈస్టు ఆల్కహాలుగా మార్చగలదు కాని ఫేనీకరణకి లొంగని చక్కెరలని ఏమీ చెయ్యలేదు. పళ్లరసాలు కూడా ప్రాణి నుండి పుట్టినవే కనుక అవి కూడ దోషరహితాలు కావు. పళ్లరసాలకి రంగు, రుచి, వాసన ఉంటాయి. పళ్ల తొక్కలకి ఒక రకం ఒగరు ఉంటుంది. వీటి సమక్షంలో ఫేనీకరణ సజావుగా సాగకపోవచ్చు. అప్పుడు అసంకల్పితంగా కొన్ని సహజాత రసాయనాలు పుట్టుకొస్తాయి. ఈ సహజాతాలలో కొన్ని విషపదార్థాలు ఉండొచ్చు. అప్పుడు ఆ బీరు కాని, వైను కాని తాగితే ప్రాణం పోవచ్చు. చవకరకం కల్లు, సారాలు తాగి ప్రతి ఏటా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్న వార్తలు మనం వింటూనే ఉంటాం కదా. అందుకనే తాగితే తాగేరు కాని ఆ తాగేదేదో మేలురకం సరుకు తాగితే ప్రాణాలు పోవు.
 
ఫేనీకరించగా వచ్చిన పానీయాలకి రకరకాల పేర్లు ఉన్నాయి. ద్రాక్ష రసం నుండి చేసిన దానిని ఇంగ్లీషులో వైన్ (wine) అంటారు. దీన్ని మనం కావలిస్తే, తెలుగులో, ద్రాక్ష సారా అనో, టూకీగా సారా అనో అనొచ్చు. బార్లీ, మొక్కజొన్న, మొదలైన ధాన్యాలని నానబెట్టి, మొలకలెత్తే సమయంలో ఫేనీకరిస్తే బీరు (beer) వస్తుంది. ఆ వైను, బీరులలో ఎతల్ ఆల్కహాలు 10 నుండి 15 శాతం వరకు ఉండొచ్చు; మిగిలినదంతా నీళ్లే. ఈ పానీయాలని వేడి చేసి, బట్టీ పట్టి, నీళ్లని చాలమట్టుకి బయటకి వెళ్లగొడితే వీటిలోని ఆల్కహాలు శాతం పెరుగుతుంది. ఇలా రకరకాల బీరులని బట్టీ పట్టి రకరకాల పేర్లతో విష్కీని తయారు చేస్తారు. మొక్కజొన్న బీరు నుండి తయారు చేసిన విష్కీని బర్బన్ (bourbon) అంటారు. వైనుని బట్టీ పట్టి బ్రాందీ (brandibrandy) తయారు చేస్తారు. డచ్చి భాషలో “బ్రాందీ” అంటేనే “దిగమరిగించిన సారా” అని, “మాడబెట్టిన వైను” అని అర్థం. బార్లీ బీరుని అభిషవించగా విష్కీ (whishky) వస్తుంది. బ్రాందీ, విష్కీలలో ఆల్కహాలు శాతం 50 వరకు ఉండొచ్చు. ఫేనీకరించిన చెరకు రసం నుండి రమ్ము (rum) తయారు చేస్తారు. ఈ రమ్మునే సంస్కృతంలో మైరేయం అనీ, ఆసవం అనీ, సీధు అనీ మూడు పేర్లతో పిలుస్తారు. ఈ మూడు పేర్లూ మూడు రకాల రమ్ములని సూచిస్తాయి. అసలు సంస్కృతంలో ఈ మాదక ద్రవ్యాలకి ఉన్నన్ని పేర్లు ఇంగ్లీషులో కూడ లేవేమో. ద్రాక్ష సారాని సంస్కృతంలో మార్ద్వీకం అంటారు. మధ్వాసవం, మాధవకం, మధు అన్నవి ఇప్ప పువ్వుతో చేసిన కల్లుకి పేర్లు.
 
ఇంతవరకు రెండు రకాల మద్యపానీయాలు చూసేం. పులియబెట్టి, ఫేనీకరించగా వచ్చిన వైను, బీరు, ఏల్ వగైరాలని ఇంగ్లీషులో ఫెర్మెంటెడ్ లిక్కర్స్ (fermented liquors) అంటారు. బట్టీ పట్టగా వచ్చిన విష్కీ, బ్రాందీ, వాద్కా, కోన్యాక్ వంటి వాటిని “డిస్టిల్డ్ లిక్కర్స్ (distilled liquors) అంటారు. ఇలా వైనుని బట్టీ పట్టి బ్రాందీగా చేసే పద్ధతిని సంస్కృతంలో అభిషవం అంటారు. ఏ పేరు పెట్టి పిలచినా బట్టీ పట్టినప్పుడు పానీయంలో ఆల్కహాలు పాలు పెరుగుతుంది. ఒక పానీయంలో ఆల్కహాలు ఎన్ని పాళ్లు ఉందో చెప్పే సంఖ్యని ఇంగ్లీషులో “ప్రూఫ్” (proof) అంటారు. వైనులో ఆల్కహాలు 15 శాతం ఉంటే ఆ వైను 30 ప్రూఫ్. ఆల్కహాలు 50 శాతం ఉన్న పానీయాలు 100 ప్రూఫ్. రసాయన పరిశోధనశాలలో వాడే “ఎతల్ ఆల్కహాలు” లో 95 శాతం పక్కా ఆల్కహాలే. అంటే అది 190 ప్రూఫ్ అన్న మాట. నూటికి నూరు పాళ్లూ ఆల్కహాలే ఉన్న ద్రవం 200 ప్రూఫ్. ఇది అపురూపమైనది. అతి విలువైనది. అరుదైనది. కల్తీ లేనిది. సీసా బిరడా తీసేసరికి గాలి లోని చెమ్మదనం లోపలికి చేరి కల్తీ అయిపోతుంది.
పంక్తి 80:
 
===ఐసొప్రోపైల్ ఆల్కహాలు===
మెతల్ ఆల్కహాలు (మెతనోలు), ఎతల్ ఆల్కహాలు (ఎతనోలు) తరువాత చెప్పుకోదగ్గది ఐసొప్రోపైల్ ఆల్కహాలు (isopropyl alcohol), లేదా జినీవా ఒప్పందం ప్రకారం ప్రొపనోలు (propanol). ఇందులో మూడు కర్బనపు అణువులు ఉన్నాయి. మధ్యనున్న కర్బనానికి ఎడా, పెడా “సిఎచ్3” (-CH3CH<sub>3</sub>) గుంపులు ఉన్నాయి. ఆల్కహాలు కనుక “ఒ-ఎచ్” (-OH) గుంపు ఉండి తీరాలి. దీని పేరులో “ఐసో” ఉంది కనుక ఈ బణువు నిర్మాణక్రమంలో పార్శ్వ సౌష్టత (లేటరల్ సిమ్మెట్రీ, lateral symmetry) ఉండాలి. కనుక “ఒ-ఎచ్” గుంపుని మధ్యనున్న కర్బనానికి తగిలించాలి. ఈ పనులన్నీ చేసిన తరువాత జాగ్రత్తగా చూస్తే మధ్యనున్న కర్బనానికి ఇంకా ఒక ఖాళీ చెయ్యి ఉండిపోయిందని తెలుస్తుంది. ఆ ఖాళీ చేతికి ఒక ఉదజని అణువుని అతికించడమే. ఇప్పుడు దీని అణుక్రమం ((CH3)2CHOH) అని రాయవచ్చు, లేదా ఈ దిగువ బొమ్మ 15.2క లో చూపినట్లు టూకీ నిర్మాణక్రమం చూపించవచ్చు. చదునుగా ఉన్న నిర్మాణక్రమం చూపించకుండా టూకీ శాల్తీని చూపించేను కనుక ప్రాయశ్చిత్తంగా పూసలు, గొట్టాలతో చేసిన నిర్మాణ క్రమాన్ని కూడ బొమ్మ 15.2చ లో చూపిస్తున్నాను. దీన్ని చూసి, చదును నిర్మాణక్రమం ఏమిటో పాఠకులే నిర్ణయించగలరు.
 
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు