జి.కిషన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[1977]]లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భాజపా తరఫున తన సేవలు అందిస్తున్నాడు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినాడు. 2001లో భాజపా రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతూయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినాడు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో <ref>సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref>గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. శాసనసభలో భాజపా పక్షనాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై [[బండారు దత్తాత్రేయ]] నుండి పార్టీ పగ్గాలు స్వీకరించాడు.<ref>http://www.hindu.com/2010/03/06/stories/2010030664060600.htm</ref>
==భాజపా పోరుయాత్ర==
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భాజపా తరఫున ఎంజీ.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి [[జనవరి 19]], [[2012]]న భాజపా పోరుయాత్ర ప్రారంభించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 20-01-2010</ref> ఈ యాత్ర 22 రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతుంది<ref>సాక్షి దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-01-2012</ref> పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు [[నితిన్ గడ్కరి]] హాజరయ్యాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/జి.కిషన్_రెడ్డి" నుండి వెలికితీశారు