పిచ్చి పుల్లయ్య (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
అప్పటికే నటునిగా పేరు సంపాదించుకున్న ఎన్.టి.రామారావు 1953లో ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. తన బంధువైన [[దోనేపూడి కృష్ణమూర్తి]] ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయన నిలదొక్కునేందుకు సినిమా తీద్దామని భావించారు. అంతేకాక ప్రయోగాలు చేసి తనలోని నటుణ్ణి, సినిమా ప్రియుణ్ని సంతృప్తిపరుచుకోవాలన్న ఆలోచన ఉన్నా, అందుకు వేరే నిర్మాతల సొమ్ము ఉపయోగించలేమన్న దృష్టితోనూ నిర్మాణం ప్రారంభించారు రామారావు. పిచ్చిపుల్లయ్య సినిమాకు రామారావు సోదరుడు [[నందమూరి త్రివిక్రమరావు]] మేనేజింగ్ పార్టనర్ గా, రామారావు, దోనేపూడి కృష్ణమూర్తిలు భాగస్వాములుగా వ్యవహరించారు. సినిమాను రామారావు ఒకప్పటి తన రూమ్మేట్ [[తాతినేని ప్రకాశరావు]]కి అప్పగించారు.<ref name="60 ఏళ్ళ ఎన్.ఏ.టి.">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="60 ఏళ్ళ ఎన్.ఏ.టి." అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref>
== విడుదల, స్పందన ==
1953లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే సినిమా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు లభించాయి.<ref name="60 ఏళ్ళ ఎన్.ఏ.టి." />
 
== మూలాలు ==