గుండమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.<ref name="ఈనాడు ఆదివారం.. 50 వసంతాల" />
=== చిత్రీకరణ ===
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[మార్కస్ బార్ట్లే]] వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు.<ref name="movie titles">గుండమ్మ కథ సినిమా టైటిల్స్</ref> సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన [[ఎన్టీ రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]], [[ఎస్.వి. రంగారావు]], [[సూర్యకాంతం]] తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన [[వాహినీ స్టూడియో]]లో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో "కోలో కోలోయన్న" పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్ లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/గుండమ్మ_కథ" నుండి వెలికితీశారు