గృహలక్ష్మి (1938 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
హెచ్.ఎం.రెడ్డి రోహిణీ పిక్చర్స్ పతాకంపై గృహలక్ష్మి చిత్రాన్ని తీయాలని సంకల్పించారు. [[దేవులపల్లి రామానుజరావు]] రాసిన [[రంగూన్ రౌడీ (నాటకం)|రంగూన్ రౌడీ]] ఆధారంగా సినిమా కథను అభివృద్ధి చేశారు. తర్వాతికాలంలో ప్రముఖ దర్శకునిగా ప్రఖ్యాతుడైన [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] అప్పటికి పత్రికా నిర్వహణ వ్యాపారంలో ఉండేవారు. సినీరంగం, నాటకరంగాలపై అభిరుచి కలిగిన బి.ఎన్.రెడ్డిని హెచ్.ఎం.రెడ్డి సంప్రదించి రోహిణీ పిక్చర్స్ లో వాటా కొనుక్కోమని కోరారు. బి.ఎన్.రెడ్డి తన తండ్రిని ఒప్పించి రోహిణీ పిక్చర్స్ లో వాటా తీసుకుని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు.<ref name="బి.ఎన్.రెడ్డి గురించి పుస్తకం">{{cite book|last1=డా.పాటిబండ్ల|first1=దక్షిణామూర్తి|title=కళాత్మక దర్శకుడు బి.ఎన్.రెడ్డి|date=డిసెంబర్ 2006|publisher=క్రియేటివ్ లింక్స్|location=హైదరాబాద్|language=తెలుగు}}</ref><ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రామానుజాచారి ఇన్సూరెన్సు ఏజెంట్ గా పనిచేసేవారు. కథానాయికకు సోదరుడైన దేశభక్తుడు గోపీనాథ్ పాత్రకు [[చిత్తూరు నాగయ్య]]ను తీసుకునేందుకు బి.ఎన్.రెడ్డి సిఫార్సు చేశారు. నాగయ్యకు ఇదే తొలిచిత్రం.
 
==పాటలు==