అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
అష్టాచమ్మా సినిమా కథకు మూలం ప్రముఖ ఆంగ్ల నాటకకర్త [[ఆస్కార్ వైల్డ్]] రాసిన ''ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్'' నాటకం. దర్శకుడు [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఆ నాటకాన్ని ఆధారం చేసుకుని, తెలుగు వాతావరణానికి తగిన మార్పులు చేస్తూ అష్టాచెమ్మా సినిమా కథ రాసుకున్నారు. మోహనకృష్ణ [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]], [[మాయాబజార్ (2006 సినిమా)|మాయాబజార్]] సినిమాలు చేశాకా మూడవ అవకాశాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న రామ్ మోహన్ ఇచ్చారు. అప్పుడు ఆయనకు చెప్పిన రెండు కథల్లో ఒకటైన ఈ సినిమా కథను ఆయన ఎంచుకున్నారు. అయితే సినిమా ప్రకారం హీరోయిన్ కి ఓ పేరంటే విపరీతమైన ఆసక్తివుండాలి. అలాంటి పేరు ఏం పెడదామా అని ఆలోచిస్తూంటే అదే సమయంలో ఘనవిజయం సాదించిన [[పోకిరి]] సినిమా, తద్వారా అమ్మాయిలకు అత్యంత ఆకర్షణీయమైపోయిన హీరో [[మహేష్ బాబు]] గుర్తుకువచ్చి అదే పేరంటే హీరోయిన్ కి ఇష్టమన్నట్టు పెట్టేశారు. సినిమాకు వర్కింగ్ టైటిల్ గా "హలో హలో ఓ అబ్బాయి" ఉండేది. "కథ కంచికి" వంటి పేర్లు ఆలోచించి చివరకు అష్టా చమ్మా అన్న పేరును ఖరారుచేశారు.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ">{{cite web |url= http://www.sakshi.com/news/funday/mohan-krishna-indraganti-special-interview-260658|title= మహేష్... ఆ పేరులోనే ఓ మత్తుంది|last1= ఇంద్రగంటి|first1= మోహనకృష్ణ|date= 26 జూలై 2015|website= సాక్షి|publisher= |accessdate=24 ఆగష్టు 2015}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
మొదట సినిమాకి హీరోయిన్ గా [[భూమిక]]ని తీసుకుందామని భావించారు. భూమిక స్క్రిప్ట్ విని, సినిమాలో పనిచేయడానికి అంగీకరించి డేట్స్ ఇచ్చారు. సినిమాకు కథానాయకుని పాత్ర కోసం ముందు [[గోపీచంద్]] ని, ఆ తర్వాత [[ఉదయ్‍కిరణ్]] ను సంప్రదించి కథ వినిపించారు. వారికి కథ నచ్చినా, ఆ పాత్రకు తాము సరిపోమని భావించి అంగీకరించలేదు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు