అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
=== నటీనటుల ఎంపిక ===
మొదట సినిమాకి హీరోయిన్ గా [[భూమిక]]ని తీసుకుందామని భావించారు. భూమిక స్క్రిప్ట్ విని, సినిమాలో పనిచేయడానికి అంగీకరించి డేట్స్ ఇస్తానన్నారు. సినిమాకు కథానాయకుని పాత్ర కోసం ముందు [[గోపీచంద్]] ని, ఆ తర్వాత [[ఉదయ్‍కిరణ్]] ను సంప్రదించి కథ వినిపించారు. వారికి కథ నచ్చినా, ఆ పాత్రకు తాము సరిపోమని భావించి అంగీకరించలేదు. సంపంగి సినిమాలో చేసిన దీపక్ ని ఎవరో సూచించగా ఆయన వచ్చి కలిశారు. ఆయన ఈ సినిమాలో పనిచేసేందుకు ఓకే కానీ అష్టాచమ్మా సినిమా నిర్మాత, దర్శకులకు అతను సరిపోడేమోనని అనుమానం. సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రకు [[కలర్స్ స్వాతి]]ని తీసుకున్నారు. అప్పటికి ఆమె యాంకరింగ్ మాత్రమే కాక [[డేంజర్]], [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]] సినిమాల్లో నటించారు. ఇక రెండో హీరో పాత్రకు తగ్గ వ్యక్తి చాన్నాళ్ళు దొరకలేదు. తర్వాతి కాలంలో దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న [[నందినీ రెడ్డి]] ఆ పాత్రకు [[బాపు]], [[కె.రాఘవేంద్రరావు]], [[మణిరత్నం]]ల సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న [[నాని]]ని సూచించారు.<br />
ఇంతలో భూమికకు భరత్ ఠాకూర్ తో పెళ్ళికుదరడంతో ఆమె సినిమాలో నటించలేనని చెప్పడంతో మళ్ళీ హీరోహీరోయిన్ల వెతుకులాట ప్రారంభించారు. నిర్మాత రామ్మోహన్ సినిమాలో రెండవ జంటగా ఉన్నవాళ్ళనే హీరోహీరోయిన్లు చేసేస్తే ఎలావుంటుందని ఆలోచన వచ్చింది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు