అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
ఇంతలో భూమికకు భరత్ ఠాకూర్ తో పెళ్ళికుదరడంతో ఆమె సినిమాలో నటించలేనని చెప్పడంతో మళ్ళీ హీరోహీరోయిన్ల వెతుకులాట ప్రారంభించారు. నిర్మాత రామ్మోహన్ సినిమాలో రెండవ జంటగా ఉన్నవాళ్ళనే హీరోహీరోయిన్లు చేసేస్తే ఎలావుంటుందని ఆలోచన వచ్చింది. దాంతో సినిమాకు నాని, స్వాతి హీరోహీరోయిన్లు అయ్యారు. రెండవ జంట కోసం వెతకడం ప్రారంభించారు. సినిమాలో అవకాశం కోసం విదేశాల్లో ఉన్న [[అవసరాల శ్రీనివాస్]] మోహన కృష్ణకు ఫోటోలు పంపారు. మోహనకృష్ణకు అతని ఫోటోలు నచ్చలేదు, అలా చెప్పినా వదలకుండా శ్రీనివాస్ వీడియో పంపించారు. వీడియోలో ఎత్తుగా, తమాషాగా ఉన్న శ్రీనివాస్ మోహనకృష్ణకు నచ్చడంతో ఆనంద్ పాత్రకు ఎంపికచేశారు. వరలక్ష్మి పాత్రకు ఎవరు సరిపోతారో అంటూ చాలా ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాలు తెలిసిన మోహనకృష్ణ కుటుంబసభ్యులు అప్పటికి అమృతం సీరియల్ లో పనిచేస్తున్న [[భార్గవి (నటి)|భార్గవి]]ని సూచించారు. ఆమెకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పి, లంగావోణీలో రమ్మని సూచించారు. భార్గవిని లంగావోణీలో చూసి సరిపోతారని భావించి వరలక్ష్మి పాత్రకు ఎంపికచేశారు.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ" />
=== చిత్రీకరణ ===
సినిమా షూటింగ్ [[హైదరాబాద్]], [[అమలాపురం]], [[బొప్పాయిలంక]], [[గూడాల]] ప్రాంతాల్లో పూర్తిచేసుకున్నారు.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ" />
== విడుదల ==
=== మార్కెటింగ్, విడుదల ===
సినిమా పూర్తయిన రెండు నెలల వరకూ విడుదల చేయలేదు.
=== స్పందన ===
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు