అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
== విడుదల ==
=== మార్కెటింగ్, విడుదల ===
సినిమా పూర్తయిన రెండు నెలల వరకూ విడుదల చేయలేదు. చిన్న సినిమాలు విడుదల చేసేందుకు సరైన సమయం చూసుకుని మరీ చేయాలన్నది నిర్మాత రామ్మోహన్ అంచనా. అందుకు తగ్గట్టే 5 సెప్టెంబర్ 2008 తేదీని సరైన సమయంగా ఎంచుకుని ప్రకటించారు. సినిమా ప్రచారానికి కొత్త తరహా విధానాలు అవలంబించారు. వినూత్నంగా సినిమా విడుదలకు వారం రోజుల ముందే విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో ప్రీమియర్ షో వేశారు. ఇలాంటి సినిమాలు విడుదలైన వారం, పదిరోజుల వరకూ నెమ్మదిగా బావుందన్న పేరుతెచ్చుకుని ఆ తర్వాత ఊపందుకుంటాయి. ఈలోగా థియేటర్ ఓనర్లు తీసేస్తే చాలా ఇబ్బందికరమైన స్థితి ఎదురవుతుంది. ఆ సమస్య పరిష్కరించేందుకు ఇలా ముందుగా ప్రదర్శన జరిగి, విడుదలయ్యేనాటికి బావుందన్న మాట వ్యాపిస్తే సినిమా విజయం మరింత ముందుగానే సాధ్యపడుతుందన్న ఆలోచనతో చేశారు. సినిమా బాగోలేదన్న పేరు తెచ్చుకుంటే మాత్రం చాలా సమస్యలు ఎదురుకావచ్చు. అయితే తన సినిమాను నమ్మి, రామ్మోహన్ ధైర్యం చేసి ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోల్లో సినిమా చాలా బావుందన్న టాక్ వచ్చింది.
 
=== స్పందన ===
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు