ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==ఇంగ్లీషు, తెలుగు భాషల పరిణతిలో పోలికలు==
[[ఇంగ్లీషు]] నుండి తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియ మీద మన దృష్టి సారించినంతసేపూ, ఈ రెండు భాషలు ప్రస్తుతం అవి ఉన్న స్థితికి ఎలా చేరుకున్నాయో ఒక సారి సమీక్షించటం ఉపయుక్తం. మొదట్లో ఉత్తర జెర్మనీ , నెదర్లాండు దేశాలలో ప్రజలు ఇంగ్లండు వలస వచ్చినప్పుడు వారితో సంబంధితమైన భాషలని కొన్నింటిని తీసుకు వచ్చారు. ఆ కలగాపులగం భాషని పాత ఇంగ్లీషు అనీ ఏంగ్లో-సేక్సన్ అనీ అనే వారు. ఈ ఏంగ్లో సేక్సన్ మీద రెండు శక్తుల ప్రభావం బాగా పడింది. సా. శ. 8, 9 శతాబ్దాలలో స్కేండినేవియా (ఇప్పటి నార్వే, స్వీడన్, ఫిన్లండ్) నుండి ఉప్పెనలా కొంతమంది వచ్చి పడ్డారు. తరువాత ఫ్రాంసు కోస్తా ప్రాంతానికి చెందిన నార్మండీ నుండి మరికొంతమంది వచ్చి స్థిరపడ్డారు. ఈ ఊపులో ఇంగ్లీషులోకి తొంబతొంబలుగా ఫ్రెంచి మాటలు వచ్చి కలిసేయి. ఇప్పటికీ ఇంగ్లీషులో ఫ్రెంచి మాటలు దరిదాపు 25 శాతం ఉంటాయి. తరువాత ఐరోపాలో ఉద్భవించిన పునర్వికాశం వల్ల ఇంగ్లీషులో ఇబ్బడిముబ్బడిగా [[లేటిన్]], [[గ్రీకు]] మాటలు వచ్చి చేరాయి. అందుకనే వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో వాడే ఇంగ్లీషుకి లేటిన్, గ్రీకు వాసనలు బాగా అంటుకున్నాయి. దీనికి తోడు వలస రాజ్యాధిపత్యం వల్ల ప్రపంచ భాషలలో మాటలు ఎన్నో కలిసిపోయి ఇంగ్లీషు ఒక ప్రతిదేయ (borrowing) భాషగా వర్ధిల్లి ప్రపంచ భాషగా అవతరించింది.
తెలుగు దక్షిణ-మధ్య భారతంలో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్]] లో వినిపించే [[ద్రావిడ భాష|ద్రావిడ భాషలు]]. సా. శ. 2011 లో, వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో 8.3 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషలలో అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది పదమూడవ స్థానం. కనీసం ఆరవ శతాబ్దపు శాసనాల నుండి తెలుగు లిఖిత రూపంలో కనిపిస్తోంది. ఆది కావ్యంగా ప్రశస్థి పొందిన నన్నయ తెలుగు భారతం పదకొండవ శతాబ్దానికి చెందింది. ఈ సమాచారాన్ని బట్టి ఆధునిక తెలుగు, ఆధునిక ఇంగ్లీషు సమాతరంగా ఎదిగేయని అనుకోవచ్చు.
 
ఫ్రెంచి, లేటిన్, గ్రీకు భాషలలోని మాటలు ఇంగ్లీషులో చేరినట్లే [[సంస్కృతం]], ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోకి పదజాలం విపరీతంగా వచ్చింది. తెలుగు మీద సోదర భాషల ప్రభావం ఉన్నా సంస్కృతం ప్రభావం అత్యధికం: సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాసే సౌలభ్యం కోసం ఒత్తక్షరాలు తెలుగులో వచ్చి చేరాయి. కనుక ఇంగ్లీషుకి లాగే తెలుగుకి కూడ పరభాషలని తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. ఈ లక్షణాన్ని చూసే హాల్డేను తెలుగుని రాజభాష చెయ్యాలంటూ కితాబు ఇచ్చేడు.
 
అయినప్పటికీ వాక్య నిర్మాణంలో తెలుగుది ద్రావిడ భాషా సంప్రదాయమే. తెలుగు వాక్యంలో కర్త-కర్మ-క్రియ ఆ వరుసలో వస్తాయి. తెలుగు నామవాచకాలు వచనాన్ని బట్టీ, లింగాన్ని బట్టీ, విభక్తిని బట్టీ ద్రావిడ భాషా సంప్రదాయానుసారం రూపాంతరం చెందుతాయి.