ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కొత్త మాటలు సృష్టించటం: లంకెలు వేస్తున్నాను
పంక్తి 85:
సైన్సుని తెలుగులో రాసేటప్పుడు ఎంత విస్తృతంగానూ, లోతుగానూ ఆలోచించి రాయాలో చవి చూపించటానికి ఈ దిగువ ఉదాహరణని పరిశీలించండి.
 
ఉదాహరణ 4. ఆధునిక శాస్త్ర రంగపు వేదిక మీద [[అణువు]] చాల ప్రథాన పాత్ర వహించింది కదా. అణువు అనే ఊహనం భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండీ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో “ఎటామిక్ థియరీ” ని డాల్టన్ ప్రవచించడానికి సహస్రాబ్దాల ముందే వైశేషిక దర్శనంలో కాణాదుడు తన “అణు సిద్ధాంతం” ఉద్ఘాటించేడు. కనుక పాశ్చాత్యుల “ఏటం” మన “అణువు” తో సర్వ సమానం. అణువులు ఉన్నాయని ప్రతిపాదించటమే కాకుండా “ద్వయాణుకము, త్రయాణుకము” అని రెండేసి అణువుల జంటలు, మూడేసి అణువుల జంటలు అనే ఊహనాలు కూడ ప్రవేశపెట్టేడు, కాణాదుడు. ఈ మాటలు రెండూ ఈనాటి “మోలిక్యూల్” అనే భావనకి ముత్తాతలు. కాని, ఈ రోజుల్లో, తెలుగు పుస్తకాలలో కొన్ని చోట్ల అణువు ని “ఏటం” అనే భావం తోనూ, కొన్ని చోట్ల “మోలిక్యూల్” అనే భావం తోనూ వాడుతున్నారు. ఇదే ధోరణిలో “ఏటం” అనే మాటని అణువు అని కొన్ని చోట్లా “పరమాణువు”[[పరమాణువు]] అని కొన్నిచోట్లా అనువదిస్తున్నారు. కవిత్వంలో ఒకే భావానికి రకరకాల పేర్లు పెట్టి వర్ణిస్తే బాగుంటుంది కాని సైన్సులో ఒక మాటకి, ఆ మాట అర్థానికి మధ్య ఒక నిర్ధిష్టమైన లంకె ఉండాలి. లేకపోతే భావం గల్లంతు అయే ప్రమాదం ఉంది. ఈ లెక్కని “ఏటం” అన్న మాటని ఎలా అనువదించాలి? అణువా? పరమాణువా?
 
ఈ ప్రహేళికని పరిష్కరించటానికి ఒక్క అడుగు వెనక్కి వేసి పరిస్థితిని సింహావలోకనం చేద్దాం. ఉదాహరణకి “అణు విద్యుత్తు,” “అణు బాంబు” అనే ప్రయోగాలు తరచు వినబడుతూ ఉంటాయి కాని “పరమాణు విద్యుత్తు, పరమాణు బాంబు" అన్న ప్రయోగాలు ఎప్పుడూ వినలేదు. కనుక అణువు అన్న మాటని “ఏటం” కి సమానార్థకంగా కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండకూడదు. అప్పుడు అణువులో ఉన్న ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు గురించి మాట్లాడవలసినప్పుడు వాటిని పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటె చిన్నవి ఉన్నాయి. వాటిని పరమాణు రేణువులు అనొచ్చు.