కంప్యూటరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆపరేటింగ్ సిస్టం: నిర్వహణ వ్యవస్థ కి లంకె తగిలించేను
పంక్తి 96:
కంప్యూటరు ఎప్పుడు ఏమిటి చెయ్యాలో విడమర్చి చెప్పే ఆదేశాలని ఇంగ్లీషులో instructions అని కాని commands అని కాని అంటారు. ఇలా ఆదేశాలని ఒక క్రమంలో రాసినప్పుడు దానిని తెలుగులో 'క్రమణిక' అనిన్నీ ఇంగ్లీషులో ప్రోగ్రామ్‌ (program) అని అంటారు. ఇలా ప్రోగ్రాములు రాసే ప్రక్రియని ప్రోగ్రామింగ్ (programming) అంటారు. ఈ ప్రోగ్రాములు రాసే వ్యక్తిని ప్రోగ్రామర్‌ (programmer) అంటారు. కంప్యూటర్‌లో రకరకాల పనులు చెయ్యటానికి రకరకాల క్రమణికలు వాడతారు. ఒకొక్క రకం ప్రోగ్రాము కి ఒకొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి ఎసెంబ్లర్‌, కంపైలర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మొదలైనవి కొన్ని రకాల ప్రోగ్రాములు. ఈ ప్రోగ్రాములన్నిటిని కలిపి ఇంగ్లీషులో సాఫ్‌ట్‌వేర్‌ (software) అంటారు. ఇలా ప్రోగ్రామర్లు రాసిన సాఫ్‌ట్‌వేర్‌ ని కంప్యూటర్‌ లోనే ఒకచోట భద్రపరుస్తారు. ఇలా భద్రపరచిన ప్రదేశాన్ని కొట్టు (store or memory) అంటారు. ఈ కొట్టు గదిలో దాచిన సాఫ్‌ట్‌వేర్‌ లోని ఆదేశాలని ఒకటీ ఒకటి చొప్పున కంప్యూటరు బయటకి తీసి, చదివి, అర్ధం చేసుకొని, ఆ ఆదేశాన్ని ఆచరణలో పెడుతుంది. ఇదంతా దరిదాపు విద్యుత్‌వేగంతో జరిగిపోతుంది. సెకెండుకి మిలియను ఆదేశాలని ఆచరణలో పెట్టగలిగే కంప్యూటర్లు సర్వసామాన్యం.
 
కంప్యూటర్లని రెండు విభిన్న కోణాల నుండి అధ్యయనం చెయ్య వచ్చు. మనిషికి స్థూలమైన భౌతిక శరీరం, కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఉన్నట్లే కంప్యూటర్లకి స్థూలకాయం ([[హార్డ్‌వేర్‌]]), సూక్ష్మకాయం ([[softwareసాఫ్ట్‌వేర్]]) అని రెండు భాగాలు ఉన్నాయి. సూక్ష్మ కాయం నివసించడానికి స్థూలకాయం కావాలి. అలాగే సూక్ష్మ కాయం లేక పోతే స్థూలకాయం ప్రాణం లేని కట్టె లాంటిది.
 
సిద్ధాంతపరంగా చూస్తే ఎటువంటి సమాచారమునయినా సంవిధానపరుచుటకు మనము కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. [[చర్చి-టూరింగు సిద్దాంతం]] ప్రకారం, ఒక నిర్దేశిత కనీస సామర్థ్యము ఉన్న కంప్యూటరుతో - అది పాకెటు డైరీ కానీవండి లేదా పెద్ద సూపరు కంప్యూటరు కానీయండి - మనము చేయగలిగే ఎటువంటి కార్యమునయినా నియంత్రించవచ్చు. కాబట్టి ఒకే రూపకల్పనను మనము వివిధ కార్యములను నెరవేర్చేటందుకు మలచవచ్చు. అవి కంపెనీలో జీతాల జాబితాలను నియంత్రించేది కావచ్చు లేదా ఫ్యాక్టరీలలో యంత్రాలను పనిచేయించే రాబోటులను నియంత్రించేవి అయినా అవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కంప్యూటరు" నుండి వెలికితీశారు