రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
http://rakshitasuma.blogspot.in/2013/03/blog-post.html
* శివరాత్రి 10మార్చి2013
== శ్రీరామోజు హరగోపాల్ గారి విశ్లేషణ==
కవిసంగమం ‘కవిత్వపండుగ’లో
కవిత్వపు ‘దారిలో లాంతరు’ ఆవిష్కరించబడిందివాళ ...
మా చిన్నారి కవయిత్రి రక్షితసుమ కవిత్వం రాయడం బాగుంది. కవిత్వం మీద ప్రేమతో రాసింది బాగుంది. కవితావస్తువులు తన వయసును మించిన జ్ఞానంతో ఎన్నుకుంది బాగుంది. ఎక్కడా బాల్యచాపల్యం కనిపించదు. చాలామంది ఇపుడు రాస్తున్నామనుకున్న కవిత్వం కన్నా బాగుంది సుమకవిత్వం. తెలుసుకోవాల్సిన ఎరుక తనకిపుడే కలగడం విశేషం. పిల్లలు చాలా గొప్పగా కవితలు రాయడం తెలుసు. వాళ్ళతో కవిత్వం రాయించిన టీచర్ గా నేను అపూర్వమైన అనుభూతిని పొందాను. రక్షితసుమ కవితలు చదివాను.విన్నాను. నెలనెలా కవిసంగమం కార్యక్రమంలో నాతో మిగతా కవులతోపాటు తాను కవయిత్రిగా పాల్గొన్ననాడే తన భావుకత, వ్యక్తీకరణశైలినచ్చి మురిసిపోయాను.
బంగారానికి తావి అబ్బినట్లుగా తన కవిత్వం ఆంగ్లంలోకి అనువదించబడడం చాలా బాగుంది.అనువాదకులు ఆ చిన్నారి మీద చూపిన అపారమైనప్రేమ, చేసిన అనువాదాలు అద్భుతంగా ఉన్నాయి. శిలాలోలిత గారి పీఠిక, శర్మగారి సమీక్ష, చాలామంది కవుల, కవయిత్రుల మాటలు మా రక్షితసుమకు ఎంతో భవిష్యత్తును వాగ్దానం చేసాయి.ఆమెలో కవయిత్రిని స్థాపించారు.
చిన్నపిల్ల చిట్టిపొట్టి కవితలు రాసుకోక ఎంత గడుసుగా రాసిందనిపిస్తుంది తన కవితలు చదువుతుంటే.....చందమామను అందాలమామ అంటే సరిపోదా? పండుగల తొలి అతిథి అని, పగలసెగల నెరుగడని, వెన్నెలసహనం ఇవ్వమనడం ఏ కవులకు తక్కువ... వెన్నెలసహనం అనే పదం తనకు తట్టడమే తన ఆలోచనల సాంద్రత ఎంతుందో తెలిసిపోతుంది.
Chant poor little thing అని తోరుదత్ తన vocation కవితలో అన్నట్లు సుమ కవిత్వాన్ని అభినందించాలి మనం.
కవిత్వాన్ని కవులు తమ నిత్యజీవితంలోంచే ఎన్నుకుంటారు కదా. జీవనశైలిని కవిత్వంలోనికి అనువదించడంలో కవుల సఫలతే వారి కవిత్వానికి గీటురాయి కదా. మా చిట్టికవయిత్రి సుమ ‘అవిజ్ఞులు’ అనే కవితలో వస్తువును కవితాసామగ్రితో ప్రతిభావంతంగా అనుపమానంగా రచించింది.
‘ మీ రెండు సిమ్ముల సోల్ లో
భక్తి బాలన్సుంటే......
ఆయనతోనే సరాసరి
ఓ కాన్ఫరెన్స్ కలపండ’ంటుంది....రెండు సిమ్ముల సోల్ అట...మనుషుల ద్వంద్వప్రవృత్తిని కడిగిపారేసింది. అమ్మో, చిన్న రాతలో పెద్దమాట.
ప్రశ్నలు, జవాబుల రూపంలో చెకుముకి రాయిలో ‘పనిలోనికి మారనిదే జ్ఞానానికి విలువేది’? అంటూ రాసింది. ‘పిల్లవాళ్ళకు చాలు’ కవితలో ‘కాస్త ప్రపంచంతో కుస్తీలుపట్టడం కూడా నేర్పండయ్యా సార్లూ’ అంటూ గురువులకే ప్రశ్నోపనిషత్తునిచ్చింది.
‘అడుగులు’ వేస్తూ ‘పరుగెత్తడమే కాదు పడిపోని తూకం కావాలి
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి’ అంటుందీ కవయిత్రి. ఎవరు చెప్పారయ్యా తనకు పడిపోని‘తూకం’ ఎట్లుంటుందో...తనకీ దర్శనజ్ఞానం గురించి ‘ఈనాటి కవిత’లో గొప్పగా సమీక్షించారు నారాయణశర్మగారు..అది రక్షితసుమ ప్రతిభా వ్యుత్పత్తి. తనకు ఉజ్జ్వలమైన భవిష్యత్తుంది.మానవతాదృక్పథం నిండిన మనీషితత్వాన్ని తనకవిత్వంగా రచిస్తుందన్ననమ్మకం కలిగింది నాకు.
కొత్తచీకట్లు కవితలో ఇట్లా రాస్తుంది తను
‘అప్పుడు లాంతరున్నవాడిదే రాజ్యం
ఇప్పుడు లాంతరున్న చోట ఉండదు రాజ్యం’...ఎందుకంటే అన్ని లాంతర్లు ‘ ఆజ్ఞా కీజియే మేరే హాకా’ అనవు.మనిషినే లేకుండా చేస్తాయి.అందుకే కొన్ని లాంతర్లతో జాగ్రత్త. కాని ఈ ‘దారిలో లాంతరు’ను జాగ్రత్తగా పట్టుకుని నడవండి కొత్త కవితాలోకంలోకి....రండి.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు