జి.నాగయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ఆచార్య '''జి.నాగయ్య''' విశిష్ట పరిశోధకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ ఆచార్యుడు<ref>[తెలుగు వాఙ్మయ చరిత్ర రచయితలు - డా. [[గుమ్మా సాంబశివరావు]] - నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ - 2012 - పేజీలు91-98]</ref>. ఇతడు రచించిన తెలుగు సాహిత్య సమీక్ష గ్రంథం సాహిత్య చరిత్రలలో సమగ్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా పేరు సంపాదించింది.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1936]], [[జూలై 30]]వ తేదీన [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]], [[లింగాల (వైఎస్ఆర్ జిల్లా)|లింగాల మండలం]], [[తాతిరెడ్డి పల్లె]] గ్రామంలో నారమ్మ, నాగప్ప దంపతులకు జన్మించాడు. ఇంటర్మీడియట్ విద్యను [[దత్తమండల కళాశాల|అనంతపురం ప్రభుత్వకళాశాల]]లో పూర్తిచేసి 1959-61లో [[తిరుపతి]]లోని [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ. తెలుగు చదివాడు. ఎం.ఎ పూర్తి అయిన తర్వాత కడప ప్రభుత్వ కళాశాలలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాడు. తర్వాత ఆచార్య [[పింగళి లక్ష్మీకాంతం]] పర్యవేక్షణలో ద్విపద వాజ్మయము అనే అంశంపై పరిశోధన చేశాడు. అనంతరం [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో అనేకమంది విద్యార్థులు పరిశోధనలు గావించి ఎం.ఫిల్., పి.హెచ్.డి పట్టాలు సంపాదించారు. ఇతని పర్యవేక్షణలో జరిగిన పరిశోధనలలో '''''ఆంధ్ర మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పరిశీలన''''' (డి.రంగారెడ్డి), '''''ఆంధ్ర మహాభారతంలో భీష్ముని పాత్ర చిత్రణము''''' (పి.లలితావాణి), ''''''మహా భారతంలో విద్యావిధానం'''''(ఆర్.మల్లేశుడు) మొదలైనవి ఉన్నాయి<ref>[https://sites.google.com/a/teluguthesis.com/catalogue/kavitrayam| తెలుగు పరిశోధనపరిశోధనల పట్టిక]</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జి.నాగయ్య" నుండి వెలికితీశారు