నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (3) using AWB
చి →‎చరిత్ర: లంకె సవరిస్తున్నాను
పంక్తి 44:
పద్దెనిమిది, పందొమ్మిది శతాబ్దాలలో [[అద్దకం]] పరిశ్రమ భారత దేశంలో బాగా పుంజుకుంది. వెలిసిపోని పక్కా రంగులని వాడి తయారు చేసిన భారతీయ వస్త్రాలకి యూరప్ లో మంచి గిరాకీ ఉండేది. అందుకనే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొత్తలో నీలి మొక్కలని [[బీహారు]] లోను, [[పశ్చిమ బెంగాల్|బెంగాల్]] లోను తోటలుగా పెంచి, శ్రామిక వర్గాలు చెమటోడ్చి తయారు చేసిన ఆ నీలిరంగుని ఎగుమతి చేసి లాభసాటి వ్యాపారం చేసేరు. కాని ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలని ఎండనక, వాననక పొలాల్లో పనిచేసిన కర్షకులతో పంచుకోటానికి సుముఖత చూపేవారు కాదు. ఆఖరికి జిల్లా కలెక్టర్లు కూడా చూసీచూడనట్లు ఊరుకునేవారు. [[సిపాయిల తిరుగుబాటు]] అయిన కొత్తలోనే, దరిదాపు 1850 ప్రాంతాలలో, పొలాల్లో పనిచేసే పనివాళ్ళు బ్రిటిష్ జమీందారుల మీద తిరగబడ్డారు. ఈ తిరుగుబాటుని చిత్రిస్తూ 1859-62 కాలంలో "నీల్ దర్పణ్" (నీలి అద్దం) అన్న పేరుతో ఒక నాటకం బిహార్లో మంచి ప్రజాదరణ పొందింది. జేమ్స్ లాంగ్ అనే కేథలిక్‌ ఫాదర్ ఈ నాటకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి రైతులకి జరుగుతూన్న అన్యాయాన్ని బయటపెట్టేడు. అందుకని బ్రిటిష్ జడ్జి ఫాదర్ లాంగ్ ని జైల్లో పెట్టేడు. దానితో గూడుపుఠాణీగా జరుగుతూన్న అన్యాయం కాస్తా బట్టబయలయింది.
 
ఇదే సందర్భంలో జాన్ బీమ్స్ (John Beames) అనే వ్యక్తి బిహార్ లోని [[పశ్చిమ చంపారణ్|చంపారన్]] జిల్లాకి కలెక్టర్‌గా నియమించబడ్డాడు. జరుగుతూన్న అన్యాయాన్ని సహించలేక ఆయన రైతుల పక్షం తీసుకుని తీర్పు చెబితే వెంటనే ఆయనని [[ఒడిషా]] బదిలీ చేసేసేరు. విక్రమార్కుడిలా ఈ బీమ్స్ ఒడిషాలో కూడ ఇదే రకం అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ రైతులకి అనుకూలంగా "రూల్స్" మార్చేసేడు. ''ది మెన్ హూ రూల్డ్ ఇండియా'' (The Men Who Ruled India) అనే పుస్తకంలో ఫిలిఫ్ వుడ్రఫ్ (Philip Woodruff) ఈ కథని చెప్పి జాన్ బీమ్స్ ని శ్లాఘించేడు. ఒడిషాలో పద్ధతులు మారేయి కాని బీహార్ లో ఏ మార్పూ రాలేదు. అక్కడ రైతులు మరొక 60 ఏళ్ళు కడగండ్లు పడ్డ తర్వాత [[మహాత్మా గాంధి]] చంపారన్ రైతుల తరఫున జైలుకి వెళ్ళటం, ఆ తరువాయి కథ ప్రపంచం అంతా వెండి తెర మీద చూడనే చూశారు. గాంధీ మహాత్ముడు సలిపిన స్వాతంత్ర్య సమరంలో ఉప్పుకి ఉన్న ప్రాముఖ్యత లాంటిదే నీలిమందుకి కూడ ఉంది.
 
== నీలిమందు తయారీ ==
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు