నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: లంకె సవరిస్తున్నాను
చి →‎చరిత్ర: లంకెలు సవరిస్తున్నాను
పంక్తి 40:
 
== చరిత్ర ==
నీలిమందు కీ [[భారతదేశం|భారతదేశానికీ]] చాలా గట్టి లంకె ఉంది. [[సింధు నాగరికత]] రోజులనుండి వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. [[హరప్పా]] దగ్గర దొరకిన ఒక [[వెండి]] పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. [[అజంతా గుహలు|అజంతా గుహలలో]] ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి. [[కౌటిల్యుడు|కౌటిల్యుడి]] [[అర్ధశాస్త్రంఅర్థశాస్త్రం]] లో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడ కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, [[ఈజిప్ట్]] లోనూ భారతదేశంలో చేసిన [[అద్దకం]] బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన [[మార్కోపోలో]] ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి [[మార్కోపోలో]] ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్థం.
 
పద్దెనిమిది, పందొమ్మిది శతాబ్దాలలో [[అద్దకం]] పరిశ్రమ భారత దేశంలో బాగా పుంజుకుంది. వెలిసిపోని పక్కా రంగులని వాడి తయారు చేసిన భారతీయ వస్త్రాలకి యూరప్ లో మంచి గిరాకీ ఉండేది. అందుకనే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొత్తలో నీలి మొక్కలని [[బీహారు]] లోను, [[పశ్చిమ బెంగాల్|బెంగాల్]] లోను తోటలుగా పెంచి, శ్రామిక వర్గాలు చెమటోడ్చి తయారు చేసిన ఆ నీలిరంగుని ఎగుమతి చేసి లాభసాటి వ్యాపారం చేసేరు. కాని ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలని ఎండనక, వాననక పొలాల్లో పనిచేసిన కర్షకులతో పంచుకోటానికి సుముఖత చూపేవారు కాదు. ఆఖరికి జిల్లా కలెక్టర్లు కూడా చూసీచూడనట్లు ఊరుకునేవారు. [[సిపాయిల తిరుగుబాటు]] అయిన కొత్తలోనే, దరిదాపు 1850 ప్రాంతాలలో, పొలాల్లో పనిచేసే పనివాళ్ళు బ్రిటిష్ జమీందారుల మీద తిరగబడ్డారు. ఈ తిరుగుబాటుని చిత్రిస్తూ 1859-62 కాలంలో "నీల్ దర్పణ్" (నీలి అద్దం) అన్న పేరుతో ఒక నాటకం బిహార్లో మంచి ప్రజాదరణ పొందింది. జేమ్స్ లాంగ్ అనే కేథలిక్‌ ఫాదర్ ఈ నాటకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి రైతులకి జరుగుతూన్న అన్యాయాన్ని బయటపెట్టేడు. అందుకని బ్రిటిష్ జడ్జి ఫాదర్ లాంగ్ ని జైల్లో పెట్టేడు. దానితో గూడుపుఠాణీగా జరుగుతూన్న అన్యాయం కాస్తా బట్టబయలయింది.
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు