కంద: కూర్పుల మధ్య తేడాలు

చి చాల చేర్పులు చేసేను
పంక్తి 24:
సంస్కృతంలో కందని "సూరణ" అనిన్నీ "కన్‌ద" అనిన్నీ, "అర్శోఘ్న" అనిన్నీ అంటారు. అర్శ వ్యాధి (మొలలు వ్యాధి లేదా piles) ని పోగొడుతుందని దీనికి "అర్శోఘ్న" అన్న పేరు వచ్చింది. కంద గడ్డ చూడడానికి ఏనుగు పాదంలా ఉంటుందని దీనిని ఇంగ్లీషులో Elephant foot yam అంటారు. దీని శాస్త్రీయనామం "ఎమార్పోఫాలస్ కాంపాన్యులేటస్" (Amorphophallus companulatus). గ్రీకు భాషలో "ఎమోర్ఫస్" అంటే నిరాకారమైన అని అర్థం. కంద దుంపకి ఒక నిర్దిష్టమైన ఆకారం లేకపోవడం వల్ల ఈ మొదటి పేరు వచ్చింది. దీని పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి కనుక రెండవ పేరు వచ్చింది.
 
భారత దేశంలో 14 కంద ఉపజాతులు కనబడుతున్నాయి. వీటన్నిటికి మూలం అనదగ్గది అడవి కంద. దీనిని తెలుగులో "వజ్ర కంద" అనిన్నీ "వన కంద" అనిన్నీ పిలుస్తారు. సంస్కృతంలో "వజ్రమూల" అనిన్నీ, "వనశూరణవనసూరణ" అనిన్నీ అంటారు. దీని శాస్త్రీయనామం "ఎమార్పోఫాలస్ సిల్వాటికస్" (Amorphophallus sylvaticus). కంద జన్మస్థానం భారత దేశమే అని శాస్త్రవేత్తలు నిర్ణయించేరు.
 
==కంద సాగు==
"https://te.wikipedia.org/wiki/కంద" నుండి వెలికితీశారు