ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ముక్తాయింపు: ఇవ్ కూడా చూడండి అనుబంధించేను
పంక్తి 81:
ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో “స్కై స్క్రేపర్” (skyscrapper) అనే మాట ఉంది. దీనిని “ఎత్తైన భవనం” అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని “అంబర చుంబితం” అని అనువదిస్తే మాటకి న్యాయం చేకూరుతుంది.
 
అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) [[వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) |ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]], సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు [[లక్షణ గ్రంథం]] (style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి.
 
సైన్సుని తెలుగులో రాసేటప్పుడు ఎంత విస్తృతంగానూ, లోతుగానూ ఆలోచించి రాయాలో చవి చూపించటానికి ఈ దిగువ ఉదాహరణని పరిశీలించండి.
పంక్తి 89:
ఈ ప్రహేళికని పరిష్కరించటానికి ఒక్క అడుగు వెనక్కి వేసి పరిస్థితిని సింహావలోకనం చేద్దాం. ఉదాహరణకి “అణు విద్యుత్తు,” “అణు బాంబు” అనే ప్రయోగాలు తరచు వినబడుతూ ఉంటాయి కాని “పరమాణు విద్యుత్తు, పరమాణు బాంబు" అన్న ప్రయోగాలు ఎప్పుడూ వినలేదు. కనుక అణువు అన్న మాటని “ఏటం” కి సమానార్థకంగా కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండకూడదు. అప్పుడు అణువులో ఉన్న ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు గురించి మాట్లాడవలసినప్పుడు వాటిని పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటె చిన్నవి ఉన్నాయి. వాటిని పరమాణు రేణువులు అనొచ్చు.
 
ఇప్పుడు మోలిక్యూల్ కి ఒక కొత్త మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అణువులు ఉండొచ్చు కనుక [[కాణాదుడు]] వాడిన ద్వియాణువు, త్రయాణువు నప్పవు. బహుళంగా ఉన్న అణువుల మూకని బహుళాణువు లేదా – కొంచెం కుదించి - [[బణువు]] అని పిలవచ్చు. ఒక నీటి బణువు చిన్న బణువుకి ఉదాహరణ; ఇందులో రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు మాత్రమే ఉంటాయి. రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు “హీం.” ఒక్క హీం బణువులో చాల అణువులు ఉంటాయి. ఇటువంటి పెద్ద బణువులని బృహత్ బణువులు (mega molecules) అనొచ్చు.
 
అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం. ఈ బాంబులలో మళ్లా రెండు రకాలు: చిన్నవి, పెద్దవి. ఈ తేడా కేవలం పరిమాణాన్ని పురస్కరించుకుని కాదు. వాటి సిద్ధాంతాలే వేరు. వాటి నిర్మాణశిల్పమే వేరు. కనుక రెండింటినీ ఒకే పేరుతో పిలిస్తే ఎలా? ఇంగ్లీషులో ఈ రెండింటిని పిలవడానికి రకరకాల పేర్లు ఉన్నాయి. చిన్న జాతి బాంబులని “ఏటం బాంబు” అని కాని, “ఫిషన్ బాంబు" అని కాని పిలుస్తారు. పెద్ద దానిని “హైడ్రొజన్ బాంబు” అని కాని, “ఫ్యూషన్ బాంబు” అని కాని, "నూక్లియార్ బాంబు” అని కాని పిలుస్తారు. తెలుగులో కూడ ఈ తేడాని గుర్తించాలంటే అణు బాంబు ని “అణ్వస్త్రం” అనిన్నీ, నూక్లియార్ బాంబుని “కణ్వస్త్రం” అనిన్నీ అనొచ్చు. ఇంగ్లీషులో నూక్లియస్ అనే మాటని తెలుగులో కణిక అని [[తెలుగు భాషా పత్రికలోపత్రిక]]లో వాడేరు, 1969 లో.
 
==దుర్నామాలని సరిదిద్దటం==