చేమ దుంప: కూర్పుల మధ్య తేడాలు

చి Vemurione, పేజీ చామ దుంప ను చేమ దుంప కు తరలించారు: వర్ణక్రమ దోషం
పంక్తి 29:
==ఆహారంగా చేమ==
[[కంద]], [[పెండలం]] మాదిరే ఈ దుంపలలో కూడ కేల్సియం ఆగ్జలేట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టుకుని తినాలి. హవాయి దీవులలో చేమ చాల ముఖ్యమైన వంటకం. దీనిని ఉడకబెట్టి, ముద్ద చేసి, ఊరబెట్టి "పోయ్" (poi) అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఉడకబెట్టిన చేమ ముక్కల్ని ఎర్రగా పెనం మీద వేయించిన (stir fry) చేమ వేపుడు తెలుగు దేశంలో ప్రసిద్ధమైన వంటకమే. ఉడకబెట్టిన దుంపలకి ఆవ పెట్టి వండిన కూర కూడ బాగుంటుంది కాని కొంచెం జిగురుగా ఉంటాయని కొంతమంది ఇష్టపడరు. పోషక విలువల పరంగా
100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల కొంత, పోషక పీచు (డయటరీ ఫైబర్‌) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములొ సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో [[మాంసకృత్తులు|ప్రాణ్యములు]] (ప్రోటీన్లు) ఉంటాయి.
 
==వైద్యంలో చేమ==
"https://te.wikipedia.org/wiki/చేమ_దుంప" నుండి వెలికితీశారు