చేమ దుంప: కూర్పుల మధ్య తేడాలు

inserted table format
పంక్తి 28:
పేరు లోని యాంటీకోరం ని బట్టి ఇది ప్రాచీన కాలం నుండీ ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం (అనగా, ప్రస్తుతం ఇండేనేసియా, ఫిలిప్పిన్ దీవులు, వియత్నాం, వగైరా. ఇది భారతదేశం లోకి ప్రాచీన్ కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు.
==ఆహారంగా చేమ==
{{nutritional value | name=Taro, cooked, without salt
| kJ=594
| protein=0.52 g
| fat=0.11 g
| carbs=34.6 g
| fiber=5.1 g
| sugars=0.49
| calcium_mg=18
| iron_mg=0.72
| magnesium_mg=30
| phosphorus_mg=76
| potassium_mg=484
| zinc_mg=0.27
| manganese_mg=0.449
| vitC_mg=5
| thiamin_mg=0.107
| riboflavin_mg=0.028
| niacin_mg=0.51
| pantothenic_mg=0.336
| vitB6_mg=0.331
| folate_ug=19
| vitE_mg=2.93
| source_usda = 1
| note=[http://ndb.nal.usda.gov/ndb/search/list?qlookup=11519&format=Full Link to USDA Database entry]
}}
[[కంద]], [[పెండలం]] మాదిరే ఈ దుంపలలో కూడ కేల్సియం ఆగ్జలేట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టుకుని తినాలి. హవాయి దీవులలో చేమ చాల ముఖ్యమైన వంటకం. దీనిని ఉడకబెట్టి, ముద్ద చేసి, ఊరబెట్టి "పోయ్" (poi) అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఉడకబెట్టిన చేమ ముక్కల్ని ఎర్రగా పెనం మీద వేయించిన (stir fry) చేమ వేపుడు తెలుగు దేశంలో ప్రసిద్ధమైన వంటకమే. ఉడకబెట్టిన దుంపలకి ఆవ పెట్టి వండిన కూర కూడ బాగుంటుంది కాని కొంచెం జిగురుగా ఉంటాయని కొంతమంది ఇష్టపడరు. పోషక విలువల పరంగా
100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల కొంత, పోషక పీచు (డయటరీ ఫైబర్‌) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములొ సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో [[మాంసకృత్తులు|ప్రాణ్యములు]] (ప్రోటీన్లు) కొద్దిగానే ఉంటాయి.
 
==వైద్యంలో చేమ==
విటమిన్‌ " సి," "బి-6 ," "ఇ," మేంగనీస్, కేల్సియం, ఇనుము, భాస్వరం తోపాటు పథ్యపు నార (dietary fiber), ఏంటీ ఆక్సిడేంట్లు వంటి పోషక పదార్థాలు చేమ దుంపలలో ఉన్నాయి.
 
పీచు , యాంటీ ఆక్సిడెంట్స్ , ఆరోగ్యవంతమైన కాంబినేషన్‌ వలన కొవ్వు గ్రహణ ను తగ్గించడము ద్వారా ఆర్టిరీలలో కొవ్వు పేరుకు పోవడాన్ని తగ్గిస్తాయి. విటమిన్‌ బి 6 కు మంది ఆదారము. గుండెజబ్బులకు , హైపర్ టెన్సన్‌ కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ' ఇ ' విటమిన్‌ ను , రక్తపోటు క్రమబద్దీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలము గా లభించును వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులను , స్ట్రోక్ రిస్కులను తగ్గిస్తుంది .
 
మెనోపాజ్ లక్షణాలకు విరుగుడు : చామ దుంపలకు మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ సక్రమ పనితీరుకు నడుమ గట్టి సంబంధము ఉందని సంప్రదాయ వైద్యము పేర్కొన్నది. ముఖ్యము గా మెనోపాజ్ తర్వాత మిది బాగా వర్తిస్తుంది. రాత్రివేళ స్వేదము ,డ్రైనెస్ , హాట్ ప్లషెస్ వంటి లక్షణాలు చేమదుంపలు తగ్గించినట్లు గుర్తించారు ... ఆయుర్వేద వైద్యులు. హార్మోన్‌ రిప్లేస్-మెంట్ థెరపీ కి ఇవి ప్రత్యామ్నాయము లాంటివి. డియోజెనిన్‌ అనే రసాయనంలోని యాంటీ-ఇన్‌ప్లమేటరీ, యాంటీ-స్పాజ్మాడిక్ , యాంటీ-ఆక్షిడెంట్ గుణాలు ఈ దుంపలో లభిస్తాయి. రుతుసంబంధిత క్రాంప్స్ , ఆర్థ్రైటిస్ నొప్పులు , కండరాల అలసట తగ్గించడానికి , ఉత్తమ నెర్వట్రాన్స్ మిషన్‌కు సహకరిస్తుంది. గర్భవతులకు నీరు పట్టడము , ఉదయము వేళ వికారము లాంటి లక్షణాలు ను తగ్గిస్తుంది.
 
చేమ జీర్ణ ఆరోగ్యసహాయకారి . వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించి , విషతుల్యాలు పేరుకోకుండా కాపాడుతుంది. కోలన్‌ కాన్సర్ , ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ ల నుండి చాలా మటుకు ఉపశాంతి (రిలీఫ్) ఇస్తుంది.
 
 
 
మరీ ఎక్కువగా తినడము వలన కడుపులో వికారము , అసౌకర్యము , విరోవనాలు వంటివి కలుగవచ్చును.
"https://te.wikipedia.org/wiki/చేమ_దుంప" నుండి వెలికితీశారు