అణువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox atom}}
==అణువులు: నిర్వచనం==
ఏదైనా ఒక రసాయన మూలకాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుంటూ పోతే ఆ మూలకం యొక్క రసాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగిన అతి చిన్న ముక్కని అణువు (atom) అని నిర్వచించేరు (smallest recognized division of a chemical element). అనగా '''అణువు''' అనేది రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్. ప్రతి ఘన, ద్రవ, వాయు, మరియు ప్లాస్మా అనేవి తటస్థ లేదా అయనీకరణ పొందిన అణువుల సమూహాలు. అణువులు చాలా చిన్నవి: అణువుల యొక్క పరిమాణాన్ని పికొమీటర్లలో (పికోమీటరు = 10<sup>−12</sup> మీటరు).
 
==అణువుల కట్టడి==
అణువులు ఎలా ఉంటాయో ఎవ్వరూ కంటితో చూడలేదు కాని, వాటి నిర్మాణశిల్పాన్ని ప్రతిబింవబించే నమూనాలు మాత్రం రెండు ఉన్నాయి. ఈ రెండు నమూనాలలోను అణువులో రెండు భాగాలు ఉన్నట్లు ఊహించుకోవచ్చు. అణువు మధ్యలో ఉన్న భాగాన్ని కణిక అని కాని కేంద్రకం (nucleus) అని కాని అంటారు. అణువు ద్రవ్యరాసి (mass) లో సింహభాగం (99.94% పైగా) ఈ కణిక లేదా కేంద్రకంలో ఉంది. మిగిలిన అత్యల్ప ద్రవ్యరాసి అణువు చుట్టూ ఉన్న ఎలక్‌ట్రానులలో ఉంది. బోర్‌ నమూనాలో ఈ ఎలక్‌ట్రానులని సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరి ఊహించుకుంటాం. ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన రెండవ నమూనాలో ఈ ఎలక్‌ట్రానులని ఒక మేఘంలా ఊహించుకుంటాం.
"https://te.wikipedia.org/wiki/అణువు" నుండి వెలికితీశారు