వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
రేడియో తరంగాలు అంటే ఏమిటి? టూకీగా చెప్పాలంటే ఇవి రేడియో కేంద్రం నుండి ప్రసారితమయే, కంటికి కనబడని, విద్యుదయస్కాంత కెరటాలు.
 
ఈ రేడియో తరంగాల సంగతి భౌతిక శాస్త్రపు దృష్టితో చూద్దాం. సూర్య రస్మిని పట్టకం (prism) ద్వారా పోనిస్తే ఆ వెలుగులోని రంగులన్నీ విడిపోయి సప్త వర్ణాలతో ఒక [[వర్ణమాల]] మన కంటికి కనిపిస్తుంది కదా. ఈ వర్ణమాలలో మనకి కనిపించే ఒకొక్క రంగు ఒకొక్క విద్యుదయస్కాంత తరంగం అన్న మాట! ఈ సందర్భంలో “రంగు” అన్నా తరంగం అన్నా ఒక్కటే! ఆ వర్ణమాలకి ఇటూ, అటూ కంటికి కనిపించని “రంగులు” చాలా ఉన్నాయి. కనిపించే రంగులని, కనిపించని “రంగు”లని, అన్నిటిని కలగలిపి [[విద్యుదయస్కాంత తరంగాలు]] అంటారు. కనబడే వర్ణమాలకి ఒక పక్క పరారుణ తరంగాలు, రేడియో తరంగాలు, రెండవ వైపున అతి నీలలోహిత, సూక్ష్మ, x-, గామా తరంగాలు ఉన్నాయి. ఈ పేర్లు అన్నీ తర్కబద్ధంగా పెట్టిన పేర్లు కావు. వీటికి క, చ, ట, త, ప, అని ఒక పక్కా, గ, జ, డ, ద, బ అని రెండవ పక్కా పేర్లు పెట్టేసి ఉంటే సుఖపడి పోయేవాళ్లం. ఆకాశవాణి వారు వారి ప్రసారాల కోసం ఈ రేడియో తరంగాలని వాడతారు కనుక ఈ తరంగాలని గ్రహించే పరికరాన్ని మొదట్లో “రేడియో తరంగ గ్రాహిణి” అనేవారు. క్రమేణా, బద్ధకించి, రేడియో గ్రాహిణి, ఇంకా బద్ధకించి "రేడియో" అనెస్తున్నారు.
 
పరారుణ తరంగాల పక్కన ఉన్న తరంగాలకి “రేడియో తరంగాలు” అన్న పేరు పెట్టకుండా మరేదయినా పేరు పెట్టి ఉంటే మన ప్రాణం సుఖాన్న పడి ఉండేది. ఉదాహరణకి “దీర్ఘ తరంగాలు” అనో “భారీ తరంగాలు” అనో పేరు పెట్టి ఉంటే బాగుండిపోయేది; అప్పుడు మన రేడియోకి ఏ భారవి అనో పేరు పెట్టుకుని ఉండేవాళ్లం!
పంక్తి 19:
ఇప్పుడు రేడియేషన్ గురించి ఆలోచిద్దాం. గాలి వీచని రాత్రి బోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురు “రేడియేషన్” అనే ప్రక్రియకి ఉదాహరణలు.
 
రేణువుల రూపంలో కాని, కిరణాల రూపంలో కాని, కెరటాల రూపంలో కాని ప్రసరించి ప్రయాణం చేసే [[శక్తి]] (energy) రేడియేషన్‌కి మరొక ఉదాహరణ. అలాగని నీళ్లల్లో వచ్చే కెరటాలు, గాలిలో ప్రవహించే శబ్ద తరంగాలు రేడియేషన్ కావు.
 
రేడియేషన్ అనేది కంటికి కనిపించే వెలుగు రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని వేడి రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని [[ఆల్ఫా రేణువులలారేణువులు]]లా ఉండొచ్చు. నిజానికి కంటికి కనిపించే వెలుగుతో పోల్చి చూస్తే కంటికి కనిపించని రేడియేషన్ కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. మరొక విధంగా చెప్పాలంటే కంటికి కనిపించే రేడియేషన్ ని “కాంతి” అనీ ‘వెలుగు” అనీ అంటాం.
 
విశ్వమంతా శక్తి మయం కనుక ఈ విశ్వంలో రేడియేషన్ లేని స్థలం అనే ప్రసక్తి లేదు. అది సర్వవ్యాప్తం.
పంక్తి 30:
ఒక కేద్రం నుండి “రేడియల్” (radial) దిశలలో ప్రవహిస్తుంది కనుక దీనిని “రేడియేషన్” అన్నారు. కేంద్రం నుండి పరిధికి గీసిన ఏ గీత అయినా సరే ఇంగ్లీషులో “రేడియస్” (radius) అనే పిలవబడుతుంది. ఈ నామవాచకం నుండి వచ్చిన విశేషణమే “రేడియల్”. కనుక ఒక కేంద్రం నుండి అన్ని దిశల వైపు ప్రయాణించేది “రేడియేషన్”.
 
తెలుగులో “రేడియస్” ని వ్యాసార్ధం అంటాం. కాని ఈ మాట పైన చెప్పిన విధంగా రకరకాలుగా మలచటానికి లొంగదు. వ్యాసం (diameter) అనే మాట కొంచెం లొంగుతుంది. వ్యాప్తి చెందేది వ్యాసం కనుక, అన్ని దిశలలోకీ కిరణాలలా వ్యాప్తి చెందే ఈ రేడియేషన్ అన్న మాట ని తెలుగులో "వ్యాప్తి చెందే కిరణం" లేదా “వ్యాకిరణం” అనొచ్చు. కాని మనకి సంస్కృతంలో “వి” అనే ఉపసర్గ “మిక్కిలి” అనే అర్థాన్ని సూచిస్తుంది: జయం అంటే గెలుపు, విజయం అంటే గొప్ప గెలుపు. చలనం అంటే కదలిక, విచలనం అంటే మిక్కిలి కదలిక. జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, విజ్ఞానం అంటే మరొక రకమయిన బ్రహ్మజ్ఞానం – సైన్సు. ఇదే ధోరణిలో వికిరణం అన్నా వికీర్ణం అన్నా మిక్కిలి వ్యాప్తి చెందేది – రేడియేషన్. అన్ని పక్కలకి ప్రసరించేది కనుక దీన్ని “ప్రసారం” అని కూడ అనొచ్చు. కాని “ప్రసారం” అన్న మాటని బ్రాడ్‌కేస్టింగ్ (broadcasting) కి కేటాయించేసేరు కనుక మనం రేడియేషన్ ని '''వికీర్ణం''' అందాం. దీనికి మరొక రూపం వికిరణం.
 
“రేడియేషన్” అన్న మాటని భౌతిక శాస్త్రంలో వాడినప్పుడు ఈ ప్రవహించేది “శక్తి” అవుతుంది. ఈ శక్తి వేడి రూపంలో ఉంటే ఈ ప్రవాహం “హీట్ రేడియేషన్” లేదా “ఉష్ణ వికీర్ణం (heat radiation).” ఈ ప్రవహించేది కాంతి అయితే అది “కాంతి వికీర్ణం” (light radiation). ఈ ప్రవహించేది “సూక్ష్మ తరంగాలు” అయితే ఇది “సూక్ష్మతరంగ వికీర్ణం” (microwave radiation).
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు