డేనియల్ నెజర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పారిస్ నుంచి పెద్దాపురం''' https://commons.wikimedia.org/wiki/File:Neizers.jpg
 
తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీతుల్ని ఫ్రెంచి భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన వక్త. డేనియల్ నెజర్స్ పుట్టి పెరిగింది పారిస్ లో, చక్కటి తెలుగు మాట్లాడుతారు. నేషనల్ ఇనిస్టిటూట్ అఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ విశ్వవిధ్యాలయంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అక్కడి విధ్యార్ధులకు తెలుగు నేర్పిస్తున్నారు. అక్కడ తెలుగు భాషకు గుర్తింపు దక్కేలాగా ప్రయత్నం చేస్తున్నారు.పారిస్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఎంఫిల్ ధీసిస్ పనిమీద తూర్పుగోదావరి జిల్లా పెద్ధాపురం 1983 లో వచ్చి రెండునెలలు వున్నారు. 1985 లో ఎంఫిల్ ధీసిస్ సమర్పించారు. తరువాత 5 నెలల వయస్సున్న బాబుతొ కలిసి 1986 నుండి 1990 వరకు పెద్దాపురంలో వున్నారు. జానపద కళారూపాలైన బుర్రకధలు, హరికధలు, తోలుబొమ్మలాట, గొల్లసుద్దులు మొదలగు అంశాలపై (పి హె చ్ డీ) పరిశోధనచేశారు.వందలమంది కళాకాఅరులను, రచయితలను కలుసుకొని సమాచారం సేకరించారు. 1997 లో పి హె చ్ డీ ధీసిస్ సమర్పించారు. పరిశోధనలో జానపదకళారూపాలగురించి, బొబ్బిలి, పల్నాటి చరిత్ర గురించి ఫ్రాన్సు దేశస్తులకు వివరించి చెప్పటం జరిగింది. పెద్దాపురంలో వుండగా నిత్యం తెలుగులో మాట్లాడేవారు. అలా తెలుగు నేర్చుకుని అప్పుడు ఫ్రాన్సు అధీనంలో వుండే యానాం. అక్కడ ఇప్పటికీ ప్రెంచి సంతతి ప్రజలు వున్నారు అక్కడికి వెళ్ళి రెండు నెలలు యానాం లో గడిపారు.
"https://te.wikipedia.org/wiki/డేనియల్_నెజర్స్" నుండి వెలికితీశారు