అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం using AWB
చి →‎అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలు: clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
పంక్తి 30:
రాయలు సర్సవతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కథ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవికవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. [[పింగళి లక్ష్మీకాంతం]] ఈ విషయంపై ఇలా పరిశీలించాడు.<ref name="pingali">పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
 
[[కుమార ధూర్జటి]] వ్రాసిన [[కృష్ణరాయ విజయము]] అనే గ్రంధంలోగ్రంథంలో
<poem>
::సరస సాహిత్య విస్ఫురణ మొనయ
పంక్తి 49:
* రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి
 
ఇలా చూస్తే తాళ్ళపాక చిన్నన్న (పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము వంటి గ్రంధముల రచయిత) బహుశా [[తాళ్ళపాక అన్నమయ్య]] కొడుకో, మనుమడో కావలెను. ఇతడు రాయల సమకాలికుడు కావచ్చును. అష్టదిగ్గజాలలో ఒకడైయుండే అవకాశం ఉంది. కందుకూరి రుద్రకవి రాయల సరస్వతీ మహలు ఈశాన్యంలో కూర్చొనేవాడని నానుడి. ఇతని నిరంకుశోపాఖ్యానము 1580లో వ్రాయబడినది అనగా ఈ కవి చిన్నతనములోనే రాయలు గతించియుండవలెను. ఆయన రాయల ఆస్థానంలో ప్రవేశించడానికి మంత్రులు, తాతాచార్యులు వంటివారెవరూ ఉపకరించకపోవడంతో రాయల క్షురకుడైన మంగలి కొండోజీ ద్వారా చేరారని, మంత్రుల కన్నా మంగలి కొండోజుయే గొప్పవాడని కీర్తిస్తూ పద్యం రాసినట్టు ప్రతీతి. ఈ మంగలి కొండోజు కృష్ణరాయల మరణానంతరం 1542-1565 వరకూ రాజ్యంచేసిన సదాశివరాయల కాలంలో ఆయనకూ, అసలైన అధికారం చేతిలో ఉన్న అళియ రామరాయలకు సన్నిహిత భృత్యుడు. బాడవి పట్టణ కాపురస్తుడైన మంగలి తిమ్మోజు కొండోజు గారు అంటూ ప్రస్తావిస్తూ చాలా దానశాసనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుద్రకవి అతని సహకారంతోనే సదాశివరాయల కొలువులోకి వచ్చారనీ, రాయల మరణానంతరం కూడా ఆయన అష్టదిగ్గజాల్లో ప్రఖ్యాతులైన కొందరు కవులు ఉండేవారని వారితోనే ఈయనకు చాటువుల్లో చెప్పే సంగతి సందర్భాలు ఎదురై ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు దిగవల్లి వెంకట శివరావు పేర్కొన్నారు. ''చేరి కన్నడభూమి చెఱవట్టు పాశ్చాత్య/నృపతిపై నొక్కింత కృప తలిర్చు'' అన్న పద్యంలో రుద్రకవి విద్యానగర వినాశనాన్ని వర్ణించడమూ ఇందుకు బలమిచ్చింది.<ref name="కథలూ గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలూ-గాథలూ (మొదటి సంపుటం)|date=1944}}</ref> రామరాజభూషణుని [[వసుచరిత్ర]] [[తళ్ళికోట యుద్ధం]] తరువాత వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. కనుక ఇతని చిన్నవయసులోనే రాయల ఆస్థానంలో ఉండడం అనూహ్యం. పింగళి సూరన జననం రాయల మరణానికి 25 సంవత్సరాలముందు కావచ్చును కనుక అతడు కూడా అష్టదిగ్గజకవులలో ఉండే అవకాశం లేదు. అంతేగాక సూరన తండ్రికి రాయలు నిడమానూరు అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెనాలి రామకృష్ణకవి కాలం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఉద్భటారాధ్య చరిత్ర బహుశా రాయల కాలంనాటి గ్రంధంగ్రంథం. పాండురంగ మహాత్మ్యం రాయలు తరువాత వ్రాసినది.
 
ఈ పరిశీలనను ముగిస్తూ పింగళి లక్ష్మీకాంతం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి - "రాయలు సరస్వతీ మహలులోని ఎనిమిదిమంది కవులు తెలుగువారే కానక్కరలేదు. రాజనీతిపరంగా వివిధ భాషలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండిఉండాలి. ఆయన తెనుగురాజు, ఆయన రాజ్యము తెనుగు రాజ్యము అయినందును ఆస్థానంలో ఐదు స్థానాలు తెలుగు కవులకు లభించాయి. అందరూ తెలుగువారేనని చరిత్రకారులెవరైనా వ్రాయదలచినచో చిక్కులు వచ్చును"
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు