యోగ దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
షడ్దర్శనాలలో యోగదర్శనం ఒకటి. దీని రచయిత పతంజలి మహర్షి. ఈయన కాలం ఇతమిత్థంగా తెలియకపోయినా, తన కాలం నాటికి వ్యాప్తిలో ఉన్న యోగ విద్యా రహస్యాలను క్రోడీకరించి యోగ సూత్రాలు రచించాడు.
 
==యోగ సూత్రాలు==
 
"అథ: యోగానుశాసనమ్" అని యోగశాస్త్ర గ్రంథం ప్రారంభమవుతుంది. యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం. జడమైన ప్రకృతి పురుషుని (జీవాత్మ) సాన్నిధ్యంవల్ల ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతినుంచి జడం ఉద్భవిస్తుంది. మహత్ అంటే బుద్ధి (చిత్తం). చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు. అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులను, వికారాలను, వృత్తులను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే.
 
చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు.
పంక్తి 17:
జ్ఞానదీప్తిరావివేక ఖ్యాతే:"
 
యోగాంగాలను అనుష్ఠించడం ద్వారా అశుద్ధి తొలగిపోయి జ్ఞాన దీప్తి వివేక ఖ్యాతి కలుగుతాయి. యోగాంగాలను ఈ విధంగా యోగసూత్ర గ్రంధంగ్రంథం పేర్కొంటుంది.
 
"యమ నియమాసన ప్రాణాయామ
పంక్తి 31:
సత్యం - త్రికరణ శుద్ధిగా సత్యమైన దాన్నే చెప్పడం, చేయడం, ఆలోచించడం. కపటం, వంచన లేశమైనా లేని మంచి నడవడి.
 
అస్తేయం - త్రికరణ శుద్ధిగా తనదికాని వస్తువును తాకకపోవడం. అంటే దొంగిలించకపోవడం.
 
బ్రహ్మచర్యం - స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటం.
పంక్తి 37:
అపరిగ్రహం - తనకు ప్రాణం నిలుపుకొనడానికి, తన విధులు తాను నిర్వర్తించుకోడానికి, ఇతరులకు సహాయకారిగా ఉండటానికి అవసరమైనంత మాత్రమే సంపాదించడం.ఒకవేళ సంపాదించినా, దాన్ని ఇతరులకు త్యాగం చేయడం.
 
2.నియమం:
 
శౌచం - శుచిగా, శుభ్రంగా ఉండటం. మనస్సునుకూడా శుచిగా చెడు ఆలోచనలకు దూరంగా ఉంచడం.
 
సంతోషం - తన విధిని తాను నిర్వర్తిస్తూ దానివల్ల ఎంత ఫలం లభిస్తే దానితోనే తృప్తిచెందడం. అత్యాశకు పోకుండా సంతోషంగా ఉండటం.
 
తపస్సు - విధి నిర్వహణలో కలిగే శరీరక కష్టనిష్ఠురాలను, శీతోష్ణాలను సహించి, ఒక ఉన్నత ధ్యేయంకోసం ఏకాగ్రతతో, దీక్షతో ప్రయత్నించడం.
 
స్వాధ్యాయం - మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మానవునికి ఏది కర్తవ్యం, వెనకటివారు ఈ విషయమై ఏం చెప్పారు, ఏం చేసారు అనేది తెలుసుకోటానికి ఉపనిషత్తులు, భగవద్గీత, గొప్పవారి జీవిత చరిత్రలు
మొదలైన ఉత్తమ గ్రంధాలను సదా పఠించడం, నామ మంత్ర జపాలు చేయడం.
 
ఈశ్వరప్రణిధానం - సమస్తాన్ని ఈశ్వరార్పణంచేసి భగవచ్ఛరణాగతి పొందటం.
 
3.ఆసన
పంక్తి 54:
'స్థిర సుఖమాసనమ్' స్థిరముగా సుఖముగా ఉన్దెదె ఆసనమ్
 
4.ప్రాణాయామ
 
5.ప్రత్యాహార
 
6.ధారణ
 
7.ధ్యానము
 
8. సమాధి
 
{{మూస:భారతీయ దర్శనములు}}
 
[[వర్గం: షడ్దర్శనములు]]
"https://te.wikipedia.org/wiki/యోగ_దర్శనం" నుండి వెలికితీశారు