మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 39:
 
==వ్యక్తిగత జీవితం==
వీరు 1885 జనవరి 22 ([[తారణ]] సంవత్సర [[మాఖ శుద్ధ షష్ఠి]]) న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేన మామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్టవశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.<ref>ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ. </ref> 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు.
==రచనారంగం==
మాడపాటివారు మంచి కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధంగ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త. రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
== ప్రజాసేవ ==
=== ఆంధ్రోద్యమం ===
పంక్తి 74:
* [http://www.madapatighs.org/aboutus.htm మాడపాటి బాలికల పాఠశాల వెబ్ సైటు] - మాడపాటి చిత్రం
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mallika_gucham&author1=maadapati_hanumantharao_pantulu&subject1=NULL&year=1915%20&language1=telugu&pages=189&barcode=2020010006120&author2=NULL&identifier1=NULL&publisher1=h_v_krishna_amp_company&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=scl&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=out_of_copyright&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0153/327 మాడపాటి హనుమంతరావు దంపతులు రచించిన మల్లికా గుచ్ఛము పుస్తకం]
 
[[వర్గం:1885 జననాలు]]
[[వర్గం:1970 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు