సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
పంక్తి 21:
మరొక అభిప్రాయం: "హనుమంతుడు" (వజ్రాయుధం వల్ల హనుమ, అనగా దవడ, కు దెబ్బ తగిలినవాడు), ఆంజనేయుడు (అంజనా దేవి కుమారుడు), మారుతి (వాయుదేవుని కొడుకు) వంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు "సుందరుడు" అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడని అంటారు.
 
[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] అనే పుస్తకం ముందుమాటలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇలా రాశాడు - ”"రామాయణమునందు తక్కిన కాండలకు తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి విడిగా "సుందరకాండము" అను పేరు ఏల .. అను సంశయము పలుమందికి కలదు. నేను సుమారు ముప్పది యేండ్లక్రింద కీ.శే. శ్రీ కాశీకృష్ణాచార్యులవారిని ఈ ప్రశ్న అడిగితిని. సుందర హనుమన్మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించుట వలన ఆ పేరు వచ్చినది అని చెప్పిరి."” <ref name="shodasi">[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000 </ref>
 
అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ, పై వాదనలతో ఏకీభవించలేదు. "శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?" అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం - సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క [[కుండలిని|కుండలినీ యోగసాధన]], త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు వసించును. కనుక ఇది సుందరకాండము. [[ఆది శంకరుడు|ఆది శంకరుని]] ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము [[సౌందర్య లహరి]]లోని "సౌందర్య" పదము ఈ భావములోనే వాడబడినది. [[బ్రహ్మాండ పురాణము]]లో ఈ కాండము "సౌందర్య కాండము" అనియే చెప్పబడినది.<ref name="shodasi"/>
పంక్తి 38:
 
===అంతఃపురంలో సీతాన్వేషణ===
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు [[రావణుడు|రావణుని]] మందిరములోనూ, పానశాలలోనూ, [[పుష్పక విమానము]]లోనూ .. అన్నిచోట్లా సీతను వెదకాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో [[మండోదరి]]ని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టం లేదు. తన కార్యం విఫలమైతే [[సుగ్రీవుడు]], రామ [[లక్ష్మణుడు|లక్ష్మణులు]], మరెందరో హతాశులౌతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.
 
'''నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః''' అని ప్రార్ధించాడు. దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, [[అగ్ని]], [[వాయుదేవుడు]], [[ఇంద్రుడు]], [[వరుణుడు]], [[సూర్యుడు|సూర్య]][[చంద్రుడు|చంద్రులు]], [[అశ్వినీ దేవతలు]], మరుత్తులు, [[శివుడు]], సకల భూతములు, [[శ్రీమహావిష్ణువు]] తనకు కార్యసిద్ధి కలిగించవలెనని ప్రార్ధించి సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు.
పంక్తి 54:
వారిలో సహృదయయైన [[త్రిజట]] అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -
[[దస్త్రం:Sita is imprisoned in the Asoka grove.jpg|thumb|left|అశోక వనములో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు]]
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.
 
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుంన్నది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, [[కుంభకర్ణుడు]] పెద్ద ఒంటెనెక్కి, [[ఇంద్రజిత్తు]] మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. [[విభీషణుడు]] మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి [[ఆకాశం]]లో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము త్రాగుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."
పంక్తి 62:
===శ్రీరామ వర్ణన===
[[File:Hanuman's visit, in bazaar art with a Marathi caption, early 1900's.jpg|thumb|సీత హనుమంతునికి చూడామణిని ఇచ్చుట]]
చెట్టుపైనుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంక ఆలస్యము చేసినచో సీత ప్రాణత్యాగము చేయగలదని ఊహించాడు. కాని ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె ఖంగారుపడి కేకలు వేయవచ్చనీ, అలాగయితే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపైనుండి మెల్లగా [[దశరథుడు|దశరథ]] కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, [[బృహస్పతి]]కి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
 
{{main|సుందరకాండలో శ్రీరాముని వర్ణన}}
పంక్తి 70:
 
[[దస్త్రం:AN00916018 001 l.jpg|thumb|left|హనుమంతుడికి చూడామణిని ఇస్తున్న సీత]]
శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని కోరాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం (హనుమంతుడు, వాయుదేవుడు, [[గరుత్మంతుడు]] తప్ప) ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.
 
అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి (యుద్ధానికి కాదు) పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి సూర్య చంద్రుల వలె, అగ్ని వాయువులవలె లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.
పంక్తి 76:
===రాక్షసులను దండించడం===
[[దస్త్రం:AN00283344 001 l.jpg|thumb|300px|అశోక వనములో రాక్షసులతో ఘర్షణ పడుతున్న హనుమంతుడు]]
సీతా దర్శనంతో సంతుష్టుడైన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుంది. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చును. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ ధ్వంసం చేసి మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.
 
ఆ కపిని బంధించమని రావణుడు ఎనుబదివేల మంది సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు - '''జయత్యతిబలో రామో, లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య, రామస్యా క్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః''' అని జయఘోష చేశాడు - ''మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన [[కిష్కింధ]] ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక'' - ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.
 
అప్పుడు రావణుడు, [[ప్రహస్తుడు|ప్రహస్తుని]] కుమారుడు మహా బలశాలీ అయిన [[జంబుమాలి]]ని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అఱచేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా యుద్ధ భూమి అంతా శత్రువుల రక్త మాంసాలు చెల్లాచెదరయ్యాయి. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేత నిహతులైపోయారు. రణ భూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోను, ఆయుధ, రధ శకలాలతోను నిండిపోయింది.
 
[[దస్త్రం:Hanuman allowing himself to be taken before Ravana.jpg|thumb|300px|left|హముమంతుని బంధించి తీసుకు వెళుతున్న ఇంద్రజిత్తు]]
పంక్తి 111:
===మధువనం===
[[File:Monkeys plunder the Honey Grove on Hanuman's return from Lanka..jpg|thumb|ఎడమ|300px|మదువనములో గొదవ చేయుచున్న వానరులు]]
సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని పరివేష్టించి కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ, మత్తెక్కి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.
 
సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. ఆంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.
 
===రామునకు సీత జాడ తెలుపుట===
 
అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. '''దృష్టా దేవీ (చూచాను సీతను)''' అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, మె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.
 
ఓ రామా! సీతామాత ఏకవేణియై, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.
పంక్తి 129:
రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పేరు గురించి పైన వ్రాసిన విషయాలలో ఆ కాండము మంత్రయుక్తమనీ, పారాయణా భాగమనీ తెలుపబడింది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం విజయవంతమౌతుందనీ బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము. అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మ శాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండను గురించి '''"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం, హనూమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమమ్"''' అని పేర్కొన్నది..<ref name="shodasi"/>
 
సుందరకాండ పారాయణా విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంధాలు ఉన్నాయి. గుంటూరు శేషేంద్ర శర్మ తన "షోడశి - రామాయణ రహస్యాలలో తెలిపిన కొన్ని విశేషాలు <ref name="shodasi"/>
 
* రామాయణానికి ఇది బీజకాండము. మంత్ర సంయుక్తము.
పంక్తి 202:
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
 
::మ్రొక్కెద రామచంద్రునకు మోడ్చెదఁ గేలు సుమిత్ర పట్టికిన్
పంక్తి 332:
::హింసించి సమస్త రాక్షసేంద్రుల సీతా
::హంసీయానకు మ్రొక్కి ప్ర
::శంసిత గతిం జనెద మిడుక సకల సురారుల్.
 
</poem>
పంక్తి 341:
;పుస్తకాలు
తెలుగులో అనేక రామాయణాలు వెలువడినాయి. వాటిలో భాగంగా సుందరకాండ కూడా ఉన్నది. ఇవే కాకుండా ప్రత్యేకంగా సుందరకాండకు సంబంధించిన అనేక రచనలు వెలువడినాయి. వాటిలో కొన్ని -
* సుందర కాండము, పారాయణ గ్రంధంగ్రంథం - శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య
* [[సూరంపూడి వెంకట సత్యనారాయణ]] - సుందరకాండము. గేయ కవిత
పంక్తి 358:
==మొత్తం సుందర కాండ సర్గల జాబితా==
 
==ఇతర విశేషాలు==
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 376:
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
 
* సుందర కాడంము, పారాయణ గ్రంధంగ్రంథం - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2002)
 
* ఉషశ్రీ రామాయణం – రచన: [[ఉషశ్రీ]] - ప్రచురణ: శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ (2005)
పంక్తి 390:
 
<!-- వర్గాలు -->
[[వర్గం:రామాయణం]]
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:రామాయణం]]
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు