తులసి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q960124
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 18:
'''తులసి''' ([[ఆంగ్లం]] Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, [[హిందూ మతము|హిందూ]] సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని [[శాస్త్రీయ నామము]] ''ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్'' (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని ''కృష్ణ తులసి'' అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని ''రామతులసి'' అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని [[పూజ]]కు వాడుతారు. [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉన్నది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడువది వది.
==తులసి ప్రాముఖ్యత==
[[దస్త్రం:Plant holy basil.jpg|250px|right|thumb|]]
[[దస్త్రం:Starr 080117-1577 Ocimum tenuiflorum.jpg|250px|right|thumb|]]
హిందూ మతంలో, ప్రత్యేకించి [[శ్రీ వైష్ణవం|శ్రీ వైష్ణవ]] సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ [[పసుపు]] [[కుంకుమ]]లు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, [[వ్రతాలు]], [[పండుగలు]], [[స్తోత్రాలు]], [[భక్తి]] గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్ధం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది.ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి,వాతావరణ కాలుష్యాన్ని నివారించి,ఆరోగ్యాన్ని రక్షించుకొని,తులసి తీర్ధం సేవించండి.త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు,నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు,గంగ మొదలగు నదులు,వాసుదేవది దేవతలు నివసింతురు.
 
వేలాది సంవత్సరాలుగా [[ఆయుర్వేదం]]లో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధంగ్రంథం [[చరక సంహితం]]లోనూ, అంతకంటే పురాతనమైన [[ఋగ్వేదం]]లోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా [[గృహ వైద్యం]][[చిట్కాలు|చిట్కాలలో]] కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి. <!--Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or [[licorice]] smell of Thai Basil; and Holy Basil has a hot, [[spicy]] flavor sometimes compared to [[cloves]].-->
 
==ఔషధంగా తులసి==
[[బొమ్మ:Ocimum tenuiflorum2.jpg|thumb|250px|తులసి మొక్క.]]
తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. [[జలుబు]], [[తలనొప్పి]], పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు,[[ గుండె జబ్బు]]లు, విషాహారాలు, [[మలేరియా]] వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.
 
;కొన్ని ఉపయోగాలు
పంక్తి 36:
*చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, [[డయేరియా]], [[వాంతులు]] వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
* ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
* ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - [[కీటకాలు|కీటకాలను]] దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, [[హెర్బల్ టీ]], నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక [[COX-2]] inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న ''యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).<ref>Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.</ref><ref> Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.</ref> ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక [[డయాబెటిస్]] ([[చక్కెర వ్యాధి]]) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.
<ref>Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118</ref> రక్తంలో [[కోలెస్టరాల్]]ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది. <ref>Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.</ref>
 
* 'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.<ref> Devi, P. Uma; Ganasoundari, A.. Modulation of glutathione and antioxidant enzymes by Ocimum sanctum and its role in protection against radiation injury. Indian Journal of Experimental Biology, v.37, n.3, 1999. March,:262-268.</ref> అలాగే [[కంటి శుక్లం|కంటి శుక్లాల]] సమస్యకు కూడా.
<ref> Sharma, P; Kulshreshtha, S; Sharma, A L. Anti-cataract activity of Ocimum sanctum on experimental cataract. Indian Journal of Pharmacology, v.30, n.1, 1998:16-20</ref>
 
==పురాణాలలో తులసి==
పంక్తి 91:
[[బొమ్మ:Tulsidevi01.jpg|thumb|left|దేవతామూర్తి రూపములో పూజించబడుతున్న తులసి]]
తులసి ఇంటి ప్రాంగణములో ఉండటం ఆ ఇంట్లో నివసించే హిందూ కుటుంబము యొక్క సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. వైష్ణవం వంటి అనేక సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు నలువైపులా దేవతాచిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్ళలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు. ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని ''తులసీవనం'' లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు.
[[Image:Japa_mala_Japa mala (prayer_beadsprayer beads)_of_Tulasi_wood_with_108_beads_ of Tulasi wood with 108 beads -_20040101 20040101-01.jpg|thumb|right|తులసి చెక్కతో చేసిన జపమాల]]
గంధర్వతంత్రము ప్రకారం ఏకాగ్రత మరియు నిష్టతో ధాన్యము చేసుకోవటానికి మరియు పూజలు చేసుకోవటానికి అనుకూలమైన స్థలాల్లో, తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రదేశాలు కూడా ఉన్నవి. అటువంటి ఆలయాలలో ఒకటైన [[వారణాసి]]లోని ''తులసీ మానస్ మందిర్'' లో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలందుకొంటున్నది. వైష్ణవులు, విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గౌరవించి నైవేద్యములో భాగముగా తులసి ఆకులను స్వీకరిస్తారు. వీళ్లు తులసి కాండముతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసి దండల తయారీ, అనేక తీర్ధయాత్రా స్థలాల్లో [[కుటీర పరిశ్రమ]]గా కొనసాగుతున్నది. గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరోపేరు కలదు.
అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మధించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. * తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు. మనుషులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది. * హిందువులే కాకుండా ఇతర ప్రాంతాల, దేశవాసులు కూడా తులసికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు హైషియన్ వర్తకులు తమ అంగళ్లలో దుష్టశక్తులు రాకుండా తులసి నీళ్లను జల్లుతారు. నవీన మెక్సికన్ గ్రామ ప్రాంతపు ప్రజలు తమ మనీపర్సుల్లో తులసి ఆకులను పెట్టుకుంటారు. ఇలాచేయడంవల్ల ధనలక్ష్మి కరుణిస్తుందని వారు నమ్ముతారు. మెక్సికన్ సంస్కృతిలో మహిళలు, తమ భర్తలు ఇతర మహిళల వెంట పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ రొమ్ముల మీద తులసి పొడిని జల్లుకోవటం ఆచారంగా ఉంది.
పంక్తి 99:
 
==తులసి పూజ==
[[బొమ్మ:Tulsi_pooja_034Tulsi pooja 034.jpg|thumb|right|200px|పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు]]
ప్రతి సంవత్సరం ''కార్తీక శుక్ల ద్వాదశి'' (సాధారణంగా [[దీపావళి]]కి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు [[చెరుకు]] గడలతో పందిరి వేసి, ఆ పందిరికి [[మామిడి]] తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సాంప్రదాయము భారతదేశములో ఉన్నది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ మరియు ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో మరియు దక్షిణాన [[గౌడియ వైష్ణవ]] సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
{{wiktionary}}
[[విష్ణు తులసి ]]<br/>
పంక్తి 108:
[[రామ తులసి]]<br/>
[[వన తులసి ]]<br/>
[[ విభూది తులసి ]]<br/>
 
==మూలాలు==
పంక్తి 143:
*[http://www.allayurveda.com/herb_month_march2004.htm ఈ నెల వనమూలిక, మార్చి 2004 (ఆయుర్వేద)]
{{వినాయక చవితి పత్రి}}
 
[[వర్గం:లామియేసి]]
[[వర్గం:భారతదేశ వృక్షసంపద]]
Line 148 ⟶ 149:
[[వర్గం:ఔషధ మొక్కలు]]
[[వర్గం:వైష్ణవ మతం]]
 
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు