ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 2:
'''ఒగ్గు కథ''' ఆంధ్రదేశపు జానపద కళారూపం. రాగ బావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించ వచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రథాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు ఒగ్గు కథలో. ఒగ్గు కథలను చెప్పే కళాకారులను ఒగ్గు గొల్లలు అంటారు.
 
ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ '''ఒగ్గు కథ'''. [[బోనం]] ఎత్తుకొని, [[వేప]] మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ [[కథ]] చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో 'ఒగ్గు కథ' ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం - గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే [[ఒగ్గు కథ]]. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.
 
''కురబ '' జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలొ [[గొరవయ్యలు]] అని వీరిని పిలుస్తారు. వైవిద్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం [[ఒగ్గు]] ([[ఢమరుకం]]) ఉపయోగించి చెప్పే వృత్తి [[పురాణం]] గురించి తెల్సుకోవడం అంటే [[కురుమ జాతి]] చరిత్ర, సంస్కృతుల్ని గురించి తెలుసుకోవట మన్నమాట. [[ఒగ్గు దీక్ష]] ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు [[మంత్రం]] బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు[[]] చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.
==పుట్టుక==
ఒగ్గు కళారూపం శైవమత వాప్తిలో ప్రచార మాద్యమంగా ఉద్భవించి ఉంటుంది. ఎందుకంటే పాల్కురికి సోమనాధుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టి, శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో శివుడు కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి చెమట నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు.
పంక్తి 16:
==కథను బట్టి కళారూపం పేరు==
ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి.
సహకార వాయిద్యం అధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు [[పంబ కథ]], [[జముకుల కథ]], [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు [[జంగం కథ]], [[పిచ్చు కుంటుల కథ]], [[గొల్ల సుద్దులు]] మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు [[హరి కథ]], [[పాండవుల కథ]], [[రేణుకా కథ]] మొదలైనవి.
 
భిన విభిన్న మైన కథా గాన కళా రూపాలలో [[ఒగ్గు కథ]] ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ వరంగల్, నల్ల గొండ హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో వుంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు ఏబై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ వున్నాయి.
 
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని డమరుకాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించిన వనీ మల్లన్న, బీరప్పకథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కుల దేవతలనీ, డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలీ వివరించారు.
పంక్తి 95:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]].అనే గ్రంధంగ్రంథం
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
[[వర్గం:తెలంగాణ సంస్కృతి]]
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు