ఆశ్లేష నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పెరు → పేరు using AWB
పంక్తి 39:
=== ఆశ్లేష నక్షత్రమున పుట్టినవారి యొక్క నైజము, తీఱు-తెన్నులు ===
ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువఁగా నుండును. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాఁటి పై చదువులను చదువుకొనఁగలుగుతారు.
వీరి పట్టుదల వీరిని ఊన్నత స్థితికి తీసికొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్ట పడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరఁపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరమ్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యతులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మాంచి పెరుపేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు.
లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, బట్టల(జవుళీ)వ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చెస్తారు. గొడవలు తగువులు తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోనేపోరు దూరముగా ఉంటారు. ఒడుఁదుడుకులు ఉండకుండ వీరి బ్రతుకు నిలఁకడఁగా ఉంటుది.
 
పంక్తి 55:
{{హిందూ మతం జ్యోతిషశాస్త్రం}}
{{తెలుగు పంచాంగం}}
 
[[వర్గం:నక్షత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆశ్లేష_నక్షత్రము" నుండి వెలికితీశారు