పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గోదవరి → గోదావరి using AWB
పంక్తి 1:
[[ఫైలు:Tungabhadra Pushkaram 05.JPG||right|thumb|250px|<center>[[2008]]లో జరిగిన[[తుంగభద్ర నది]] పుష్కరాలలో [[మహబూబ్ నగర్]] జిల్లా [[ఆలంపూర్]] వద్ద నదిలో స్నానం చేస్తున్న భక్తులు</center>]]
ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నం ,అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.
 
గోదవరిగోదావరి పుష్కరాలు 2015 మొదలు తేదీ 14 జూలై 2015. ఆఖరు తేదీ 25 జూలై 2015. మొత్తం దినాలు 12.
 
'''[[పుష్కరం]]''' అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత [[కాలమానము]]. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి [[భారతదేశము]]లోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని [[హిందువులు]] భావిస్తారు.
పంక్తి 39:
 
==పుష్కరాల ఉద్దేశం==
నదీ బాగోగులు, అనగా నదీ పర్యావరణము, పరిశుభ్రతను తెలుసుకొనేందుకే పుష్కరాలు ఆచరించడమనే సంప్రదాయం పుట్టిందని పలువురి అభిప్రాయం. నదీ తీరంలో ఎక్కడ మెరక, పల్లం ఉంది? ఎక్కడెక్కడ కోతకు గురవుతున్నది? ఎక్కడ చెట్లు నరికివేశారు? ఏ ప్రాంతంలో కలుషితమౌతోంది? అనే విషయాలు అధ్యయనం చేసి, దాని బాగోగులు చూడటానికే 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే ప్రక్షాళన కార్యక్రమమే పుష్కరాలు అని, అంతే గాని కేవలం పూజలు నిర్వహించి స్నానాలు చేయడానికి కాదని సుప్రసిద్ధ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అభిప్రాయపడ్డారు <ref>Eenadu daily, July 14, 2015, East Godavari District Edition </ref>. హృదయంలో పశ్చాత్తాపం మార్పు వస్తే తప్ప నదిలో కేవలం స్నానం చేయడం వలన చేసిన పాపాలు పోవని, పుణ్యం రాదని, వాస్తవానికి ఆధ్యాత్మికత జోడించంవలనే ప్రజలకు నదీ ప్రాముఖ్యత తెలుస్తున్నదని పలువురి అభిప్రాయం.
 
==పుష్కరాల వెనుక ఉన్న ఇతిహాసం==
పంక్తి 85:
[[విజయవాడ ఆన్లైన్|http://vijayawadaonline.com/news/979-godavari-pushkaralu.html]]
{{పుష్కరము}}
 
 
[[వర్గం:కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/పుష్కరం" నుండి వెలికితీశారు