చాణక్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ఇందుశర్మ యంగీకరించి నందుల చెంతకేగి చెలిమిగడించి రాక్షసుని చెంత బ్రాపకము నార్జించి తలలో నాలుకవలె గలిసిమెలసి యుండి రాజ్యరహస్యము లన్నియు నెప్పటికప్పుడు చాణక్యున కెఱింగించుచుండెను. చాణక్యుడు చంద్రగుప్తుని వెంటగొని హిమాలయపర్వత ప్రాంతమునందున్న యరణ్య భాగములను బాలించుపర్వతరాజు చెంత జేరి యతని స్నేహమును సంపాదించి నందులను చంపుటకు కాతని బ్రోత్సహించెను. గెలిచిన యెడల నందరాజ్యమునందు సగము పర్వతరాజునకొసంగుటకు గూడ జాణక్యుడు వాగ్దానము గావించెను. జయించితిమేని జాణక్యుని జంద్రగుప్తుని వంచించి నందరాజ్యము నంతయు హరింప వచ్చునని పర్వతరాజు తలంచి సామంతుల యొద్దనుండి మిత్రుల యొద్దనుండి యసంఖ్యాకమగు సైన్యమును రప్పించి చాణక్యుడు పెట్టిన సంమూర్తమున నందరాజ్యముపైకి దాడికి వెడలెను. పర్వతరాజు వెంట నాతని సైన్యమె కాక శక, యవన కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లి కాది సైన్యములుగూడ వచ్చెను. చాణక్యుడు, చంద్రగుప్తుడు సైన్యమును మూడు భాగములుగా భాగించి తాము చెరియొక భాగమును దీసికొని గండకీ ప్రాంతమునకు బోయి పాటలీపుత్రమును ముట్టడించిరి. పర్వతరాజు కడమ మూడవభాగమును వెంటగొని గంగా శోణా సంగమప్రదేశము చెంత పాటలీపుత్రమును ముట్టడించెను. ఇందుశర్మ నందులనందరిని జీలదీసి చాణక్యునకు బట్టియిచ్చెను. చాణక్యుడు ఎనమండ్రు నందులను సంహరించి తన మొదటిప్రతిజ్ఞను నిర్వహించి యప్పుడు తల వెండ్రుకలను ముడివైచికొనెను.
 
నందుల నాశము జూచి మంత్రియగు రాక్షసుడు జింతించి చీలిన సైన్యమునంతయు గూడబఱచిసమైఖ్య బఱచి పర్వతరాజు సైన్యముతో బాటలీపుత్రసైన్యమును భయంకరముగా యుద్ధము జేయించెను. నందరాజులమరణము విన్న రాక్షసుల సైన్యము కొంతసేపటికి బర్వతరాజు సైన్యమునకు లొంగిపోయెను. పాటలీపుత్రమునందు అమాత్య రాక్షసున కెక్కుడుకెక్కువ పలుకుబడి యుండుటచేతను వెంటనే రాజ్యమున బ్రవేశించినచో జంద్రగుప్తునకైనను దనకైనను నపాయము గలుగవచ్చుననియు బర్వతరాజు నందరాజ్యమంతయు దానే లోగొనువశపరచుకొను నేమోయనియునేమో సంశయించియనియు చాణసందేహించి క్యుడు చాణుక్యుడు జయించిన రాజ్యమున బ్రవేశింప నగరబహిర్భాగముననగరము వెలుపల బరిజనముతో విడిసి యుండెను.
 
== పేరు ==
"https://te.wikipedia.org/wiki/చాణక్యుడు" నుండి వెలికితీశారు