కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB
పంక్తి 42:
 
==జీవితం==
[[1877]] [[మే 18]] న [[కృష్ణా జిల్లా]] [[పెనుగంచిప్రోలు]] లో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]] ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాధమికప్రాథమిక విద్యను [[భువనగిరి]] లో పూర్తిచేశాడు.
 
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు [[నాగపూరు]] (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరు లో ఉంటూ [[మరాఠీ భాష]] ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ. లో ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, [[ఇంగ్లీషు]] మాత్రమే కాక [[సంస్కృతము]], [[బెంగాలీ]], [[ఉర్దూ]], [[హిందీ]] భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
పంక్తి 202:
* లక్ష్మణరావు, ఆయన (సవతి) అక్క [[బండారు అచ్చమాంబ]] ల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''అబలా సచ్చరిత్రమాల'' అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు. అచ్చమాంబ 18-1-1905 లో మరణించింది.
* ఇంతటి ఆధునికతను సంతరించుకొన్న లక్ష్మణరావు అభిప్రాయాలు వ్యావహారికభాష వాడకం విషయంలో మాత్రం సంప్రదాయంవైపు మొగ్గు చూపాయి. వైజ్ఞానిక దృక్పథాన్ని విస్తరించడానికి జీవితాన్ని ధారపోసిన ఆయన, విజ్ఞానాన్ని అందరికీ పంచడానికి వ్యావహారికభాష వాడాలని గుర్తించలేకపోయాడు. రచనలలో గ్రాంధిక భాషనే వాడాలని ఆయన అనేకమార్లు నొక్కి వక్కాణించాడు.
* లక్ష్మణరావు కుటుంబం కృష్ణా జిల్లాకు చెందినది. ప్రాధమికప్రాథమిక విద్య తెలంగాణాలో జరిగింది. తరువాత మహారాష్ట్ర ప్రాంతంలో చదివాడు. తెలంగాణా పట్ల లక్ష్మణరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. ఆయన హైదరాబాదులో ప్రారంభించిన సంస్థలవలన ఆధునిక తెలుగు భాష వికాసానికి తెలంగాణా ప్రాంతంలో పునాదులు పడ్డాయి. [[పోతన]] నివాసస్థలం అయిన ''ఏకశిలానగరం'', [[కడప]] జిల్లాలోని [[ఒంటిమిట్ట]] కాదని, [[వరంగల్లు]] అని సహేతుకంగా నిరూపించాడు. త్రిలింగాలలో [[ద్రాక్షారామం]], [[శ్రీశైలం]] లతోబాటు మూడవది [[శ్రీకాళహస్తి]] కాదని, [[మంథని]] దగ్గర ఉన్న [[కాళేశ్వరం|కాళేశ్వరమ]] ని మొదటిసారి చెప్పినది ఈయనే. ఒక సందర్భంలో ఈయన ఇలా అన్నాడు - ''ఆంధ్ర దేశమును గురించియు, ఆంధ్ర రాజులను గురించియు, ఆంధ్ర వాఙ్మయమును గురించియును ఎక్కుడు పరిశోధనలను జేసి, క్రొత్తవింతలను కనుగొనదలచినవాఱికి హైదరాబాదు రాజ్యమందలి తెలుగు భాగమొక బంగారపు గని''
* మహారాష్ట్ర ఆచార వ్యవహారాలు లక్ష్మణరావుకు బాగా అలవాటయ్యాయి. ఆయన తలగుడ్డ, పొడుగుకోటు, ఉత్తరీయం వేసుకొనే విధానం అలాగే ఉండేవి. తన కుమారునకు వినాయకరావు అని పేరు పెట్టాడు. ఆయన మొదటి గ్రంథం ''శివాజీ మహారాజు చరిత్ర''. - ఒకసారి ఆయన - ''ఈ మరాఠీవారెప్పుడును ఇట్టి పట్టుదలయు, దేశాభిమానము గలవారు'' అని వ్రాసాడు.
* లక్ష్మణరావు ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో క్రొత్తగా వాడాడు. వీటిలో చాలావరకు మరాఠీ వాడకంనుండి గ్రహించినవి - ''విశ్వ విద్యాలయం'', ''సంపాదకుడు'', ''శిక్షణ'', ''రాష్ట్రీయ'' అటువంటి కొన్ని పదాలు.