రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కేరళ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 36:
|signature =
}}
'''రాజా రవి వర్మ''' [[భారత దేశం|భారతీయ]] చిత్రకారుడు. అతను [[రామాయణం|రామాయణ]], [[మహాభారతము]]లలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. [[1873]] లో జరిగిన [[వియన్నా]] కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, [[1906]]లో, 58 సంవత్సరాల వయసులో [[మధుమేహం]]తో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.<ref>http://www.hindu.com/yw/2006/05/12/stories/2006051204300600.htm</ref>
 
==బాల్యము==
పంక్తి 43:
 
==వృత్తి==
1873 [[వియన్నా చిత్ర ప్రదర్శన]]లో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చాడు.<ref> Kilimanoor Chandran, ''Ravi Varmayum Chitrakalayum''(in Malyalam),Department of Culture,Kerala, 1998</ref> ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి పొందింది.
 
1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబై లో ప్రారంభించాడు. అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.
 
రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి. <ref>'''రవివర్మ మెచ్చిన పల్లె''', ఈనాడు ఆదివారం అనుబంధం 10 నవంబర్ 2013 పే 18</ref>
 
==రవివర్మ బొమ్మల కొలువు==
పంక్తి 59:
<gallery widths="200px" heights="200px">
Image:Bheeshma_oath_by_RRV.jpg|[[భీష్ముడు|భీష్ముని]] ప్రతిజ్ఞ
Image:Ravi_Varma-Yashoda_adorning_Krsna.jpg|[[శ్రీ_కృష్ణుడుశ్రీ కృష్ణుడు|కృష్ణుని]] అలంకరించే [[యశోద]]
Image:Ravi_Varma-Descent_of_Ganga.jpg|[[గంగా నది|గంగావతరణం]]
</gallery>
 
==పేరు తెచ్చిన చిత్రాలు==
[[బొమ్మ:Ravi_VarmaRavi Varma-Swarbat_player_jewellerySwarbat player jewellery.jpg|thumb|200px|right|స్వర్బత్ వాయించే యువతి ఆభరణాలు]]
క్రింది చిత్రాలు రాజా రవివర్మ కు ఎంతో పేరు తెచ్చినవి:
* పల్లె పడుచు
పంక్తి 90:
 
==తాత్విక దృష్టి==
రవివర్మ తాత్విక దృష్టి గురించిన వివరాలు తెలియవు. ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి (అందులో అతనికి క్రమమైన ప్రాధమికప్రాథమిక శిక్షణ ఉంది అని తెలిసినా) తెలియదు. రవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవివర్మ వ్రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటము వలన వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలి పోతుంది. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది.<ref> A tour in Upper India, C . Raja Raja Varma was translated and published in a malayalam journal ''Thilakam'' edited by G Shankara Kurup, now out of print</ref> సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయము చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు.<ref name=QOAS>[http://www.oup.com/us/catalog/general/subject/ArtArchitecture/History/NonWestern/~~/cHI9MTAmcGY9MCZzcz1wdWJkYXRlLmFzYyZzZj1jb21pbmdzb29uJnNkPWFzYyZ2aWV3PXVzYSZjaT0wMTk1NjU5NzE2 "Raja Ravi Varma: Portrait of an Artist"]. May 05, 2006 <u>Oxford University Press</u>.</ref>
 
== రవివర్మ పై గల విమర్శలు==
పంక్తి 149:
[[వర్గం:ప్రపంచ చిత్రకారులు]]
[[వర్గం:కేరళ ప్రముఖులు]]
 
 
<!-- Interwiki links -->
"https://te.wikipedia.org/wiki/రాజా_రవివర్మ" నుండి వెలికితీశారు