ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (2) using AWB
చి →‎పరిపాలన: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 95:
== పరిపాలన ==
 
ఒమన్‌ పాలకుడు వారసత్వంగా వచ్చే సుల్తాను. ఈయన అన్ని పరిపాలనాధికారాలు కలిగి ఉంటాడు. పాలనా నిర్వహణకు సుల్తానుకు సలహాలిచ్చే 25 మంది సభ్యులుగల మంత్రి మండలి నియమితమౌతుంది. 1990లో "మజ్లిస్ అస్-షూరా" అనే సలహా సంఘాన్ని పరిమితమైన వోటు విధానం ద్వారా ఎన్నుకొన్నారు. 1996లో సుల్తాన్ ప్రకటించిన రాజశాసనం కొన్ని కీలకమైన పాలనాప్రక్రియలకు మూలాధారం. వారసత్వం విషయంలో ఉన్న అనిశ్చితిని తొలగించారు. పరిమిత చట్ట హక్కులు గల రెండు సభల సలహా సంఘం ఏర్పడింది. ఒమన్ పౌరులకు ప్రాధమికప్రాథమిక పౌరహక్కుల హామీ ఇచ్చారు.
 
ఒమన్‌కు ప్రత్యేకంగా రాజ్యాంగమంటూ లేదు. వివిధ రాజాజ్ఞలే పరిపాలనకు మౌలిక విధానాలు. అలాగే రాజకీయ పార్టీలు కూడా లేవు. ఒక్కొక్క 'విలాయత్'‌కు సుల్తానుచే నియమింపబడ్డ ఒక్కొక్క 'వాలీ' ఉంటాడు. ఇతను స్థానిక పరిపాలనకు బాధ్యుడు.
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు