"సింగపూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి (clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
సింగపుర అనే పేరు రెండు మలయ్ (మూలం [[సంస్కృతం]]) పదాలైన సింగ ([[సింహము]]) మరియు పుర (పురము) అనే రెండు పదాల కలయిక వలన వచ్చింది. చారిత్రక పుటల ప్రకారము, పధ్నాలుగువ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు సంగ్ నిల ఉతమ ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల వలె ఉన్న ఒక వింత జంతువు కనిపించినందుకు ఆ పేరు పెట్టాడట.
 
[[దస్త్రం:Marina bay new IR.jpg|thumb|left|200px|సింగపూరు యొక్క డౌన్ టౌన్ ]]
దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. వ్యాపారపరంగానూ, ఆర్ధికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయముగా మారినది. పర్యాటకముగానే కాక విలాసాలకు,వినోదాలకు పేరుపొందిన దేశము సింగపూర్.
 
 
=== నైట్ సఫారీ ===
నైట్ సఫారీ అంటే రాత్రివేళలో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. జంతుప్రదర్శనశాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళలో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటము పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళలో కూడా జంతుప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.
 
=== పక్షుల పార్క్(Bird Park) ===
ఇక్కడ పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అద్భుతమైన ఈ ప్రదర్శన పర్యాటకులనెంతో ఆకర్షిస్తుంది.అలాగే అనేక రకముల పక్షులను ఇక్కడ సందర్శించ వచ్చు. గద్ద తన ఆహారాన్ని ఎలా వేటాడుతుందో ఇక్కడ సందర్శకుల కోసము ప్రదర్శిస్తూ ఉంటారు.అత్యంత అపురూపమైన లేత కాషాయ రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తము చుట్టి చూడటానికి చక్కని రైలు ప్రయాణము ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్ పై భాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పైకి వెళ్ళినపుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా చూడగలగటము ఒక అద్భుతమైన ఆకర్షణ.
 
=== సెంతోసా ద్వీపం ===
 
== విద్యావిధానం ==
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. 50 శాతం విద్యార్ధులు తమ స్కూలుకు ముందు దశ తరగతులలోనే ఇంగ్లీష్ మాధ్యమంతో విధ్యారంభం చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు కిండర్ గార్డెన్ చదువు ప్రారంభిస్తారు.ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు దశ తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. వీరి అధికారిక పార్టీకి చెందిన సంస్థలే ఎక్కువ శాతం ఆరంభ పాఠశాలలను నిర్వహిస్తుంటాయి. పాఠశాలలలు ఎక్కువగా గణితము ,సామాన్యశాస్త్రము మొదలైనవి ఇంగ్లీష్ లోనూ, మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను రెండవ భాషగానూ బోధిస్తుంటాయి.విశేషాధికారాలు కలిగిన కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ వారి పిల్లలకు బోధిస్తూ ఉంటాయి.పాఠశాలల నిర్వహణపై కఠిన కట్టుబాట్లు లేని కారణంగా ఇక్కడ విద్యా సంస్థలు రకరకాలైన విధానాలతో నడుపుతూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు,ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు, విశేషాధికారాలు కలిగిన పాఠశాలలు, స్వతంత్ర్య పాఠశాలలు మరియు ప్రజా సంస్థల నిధులతో నడిపే పాఠశాలలు ఇక్కడి విద్యావిధానంలో భాగాలు. విద్యావిధానంలో చేరని మూడు సంవత్సరాల కిండర్ గార్డెన్ (ప్రాధమికప్రాథమిక విద్యకు ముందు తరగతులు)తరువాత 6 సంవత్సరాల ప్రారంభ విద్య . స్కూల్ లీవింగ్ పరీక్షల తరువాత ఎంచుకున్న పాఠ్యాంశాలతో 4 నుండి 5 సంవత్సరాల మాధ్యమిక తరగతులు అనంతరం న్ లెవెల్ లేక ఒ లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు.జూనియర్ కళాశాలలు 2 నుండి 3 సంవత్సరాల ప్రి యీనివర్సిటీ తరగతులు నిర్వహిస్తాయి.
 
== భాష ==
 
పర్యాటక రంగానికి అత్యధికంగా ప్రాధావ్యతనిచ్చే దేశాలలో సింగపూరు ఒకటి. సింగపూరు ప్రజల తలసరి ఆదాయం 29,474 అమెరికన్ డాలర్లు. నిరుద్యోగం 1.7 శాతం. సింగపూరు విదేశీ యాత్రీకులకు అత్యంత ఆకర్షణీయమైన దేశం. [[2006]]వ సంవత్సరములో మాత్రమే 97 లక్షల వీదేశీ యాత్రీకులు ఈ దేశాన్ని సందర్శించారు. విదేశీ యాత్రీకులను అత్యధికంగా ఆకర్షించే వ్యాపార కేంద్రం ఆర్చర్డ్ రోడ్. యాత్రీకులను ఆకర్షించడానికి కాసినోలు అనబడే రెండు ఆధునిక జూదగృహాలకు [[2005]]వ సంవత్సరంలో రాజ్యాంగ పరమైన అనుమతి సింగపూరు ప్రభుత్వం నుండి లభించింది. ఇంటిగ్రేటెడ్ రిసార్ట్స్ అనబడే ఇవి మరీనా తీరంలోనూ, సెంటోసా లోనూ రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి తమ నిర్మాణాన్ని [[2009]] లో పూర్తి చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇవి కాక నిర్మాణదశలో ఉన్న 165 మీటర్ల ఎత్తైన ఫెర్రీ వీల్, సముద్రతీరంలో ఉద్యానవనాలు, మరీనా దక్షిణతీరాన నిర్మిస్తున్న 280 మీటర్ల పొడవైన '''డబులు హైలెక్స్ బ్రిడ్జ్ '''
సందర్శకులకు అదనపు ఆకర్షణ కానున్నాయి. సింగపూరు ప్రభుత్వము హాంగ్ కాంగ్, [[బాంకాక్]]లతో పోటీని తట్టుకొనే విధంగా నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్య క్రమాన్ని చేపట్టింది. సందర్శకుల సౌకర్యాలను పెంచే విధంగా హోటల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు.
 
వైద్యచికిత్స కొరకు వచ్చే యాత్రీకులను ఆకర్షించడంలో సింగపూరు త్వరితగతిని అభివృద్ధిని సాధించింది. ఒక్కొక్క సంవత్సరము 2 లక్షల మంది వైద్య చికిత్సల కోసం ఇక్కడికి చేరుకుంటారు. [[2012]] నాటికి వైద్యం కోసం వచ్చే యాత్రీకుల సంఖ్య 10 లక్షల వరకు పెంచి 3 బిలియన్ల అమెరికన్ డాలర్ల రాబడిని పొందాలని ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్య రంగంలో 13,000 ఉద్యోగాలు అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వ అంచనా.
సింగపూరు ఆర్ధికరంగంలో ఆధిక్యత సింగపూరు ప్రభుత్వ సంబంధిత రవాణా రంగము, ప్రచురణ సంస్థలు, ప్రసార సంస్థలు, ప్రజావసరాలు మొదలైన సంస్థలదే. సింగపూరు అతితక్కువ అవినీతి కలిగిన దేశంగా [[ఆసియా]]లో ప్రధమ స్థానంలోను, అంతర్జాతీయంగా పదవ స్థానంలోనూ ఉంది. పారదర్శకమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా సింగపూరుకు అంతర్జాతీయ ప్రత్యేకత ఉంది.
 
సింగపూరు చట్టం బ్రిటిష్ ఇండియన్ చట్టాన్ని అనుసరించేదే అయినా పి ఏ పి పార్టీ మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ ప్రజాస్వాతంత్ర్యపు విలువలు పాటించడంలో కొంతవరకు విముఖత చూపిస్తూనే ఉంది. విభిన్న సంస్కృతుల, మతముల, భాషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్ర్యాన్ని ఒకింత కట్టుబాటులో ఉంచుతూ ఉంది. అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టే విధంగా బ్లాగులలో వ్యాఖ్యానాలను ప్రచురించిన ముగ్గురు బ్లాగర్ల పై చర్య తీసుకోవడం ఇందుకు నిదర్శనం. అధిక జరిమానా, కొరడాదెబ్బలు లాంటి శిక్షలు అమలులో ఉన్నాయి. క్రూరమైనహత్యలూ, హానికరమైన మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాలలో సింగపూరుది అగ్రస్థానం. ఉరిశిక్షల అమలు విషయంలో అంతర్జాతీయ మానవహక్కుల సమితి విమర్శలను ఎదుర్కుంటున్న సింగపూరు ప్రభుత్వం తమ దేశంలో అమలు చేయవలసిన చట్టంపై తమకు సంపూర్ణ హక్కు ఉందని వాదిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటోంది.
 
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1653256" నుండి వెలికితీశారు